ఢిల్లీ : గతంలో భారత జట్టుకు కలిసి ఆడిన దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు తండ్రుల బాటలోనే పయనిస్తున్నారు. ద్రవిడ్ కొడుకు అన్వయ్, వీరూ తనయుడు ఆర్యవీర్.. సెప్టెంబర్ 18 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్లో పోటీపడే భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నారు.
ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్న 18 ఏండ్ల ఆర్యవీర్కు భారత జట్టు తరఫున ఇదే తొలి పిలుపు కాగా అన్వయ్ గత నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన అండర్-19 జట్టుతో రెండు మ్యాచ్లు ఆడి రాణించాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు లక్ష్య రాయ్చందని సారథిగా వ్యవహరించనున్నాడు.