లండన్ : రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సిమోన హలెప్ మరోసారి డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఆమె ఆరోగ్య చరిత్రను పరిశీలించి నిషేధిత ఉత్ప్రేరకాలను వినియోగించినట్టు ధృవీకరణకు వచ్చినట్టు అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటి ఏజెన్సీ(ఐటిఐఏ) తెలిపింది. గత యేడాది అమెరికా ఓపెన్ సందర్భంగా హలెప్ డ్రగ్ టెస్టులో విఫమైన సందర్భంగా తొలిసారి డోపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నది. ఇటీవల హలెప్ బయోలాజికల్ పాస్‌పోర్ట్ చరిత్రను పరిశీలించిన పిదప ఆమె ఉత్ప్రేరకాలు వాడినట్టు వెల్లడైందని ఐటిఐఏ తెలిపింది. దీనిపై హలెప్ స్పందిస్తూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని పేర్కొంది.