World Chess Champion | ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేశ్ రికార్డు
World Chess Champion | అతి పిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్ రికార్డు సృష్టించాడు. ఫిడె ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చైనాకు చెందిన డింగ్ లిరెన్‌తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు.
World Chess Champion | అతి పిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్ రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ల వయసులోనే ఫిడె ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చైనాకు చెందిన డింగ్ లిరెన్‌తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన 14వ రౌండ్ (చివరి క్లాసికల్ గేమ్)లో డింగ్ 6.5 పాయింట్లు సాధించగా.. గుకేశ్ 7.5 పాయింట్లు సాధించాడు. 2012లో విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయుడిగానూ గుకేశ్ చరిత్ర సృష్టించాడు.
సింగపూర్‌లో జరిగిన ఫిడే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో డింగ్ లిరెన్, గుకేశ్ మధ్య గట్టి పోటీనే జరిగింది. వీరిద్దరి మధ్య బుధవారం జరిగిన 13వ రౌండ్లోనే ఫలితం తేలాల్సి ఉంది. కానీ ఇద్దరూ ఒకరి ఎత్తులను మరొకరు చిత్తు చేస్తూ దాదాపు 5 గంటల పాటు ఉత్కంఠగా పోటీ పడ్డారు. అయినప్పటికీ ఇద్దరూ చెరో 6.5 పాయింట్లతో సమానంగా పోటీ పడ్డారు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. ఇవాళ జరిగిన చివరి క్లాసికల్ గేమ్‌లో డింగ్ లిరెన్ 6.5 పాయింట్లు సాధించగా.. గుకేశ్ 7.5 పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచాడు.
గుకేశ్ పెరిగింది తమిళనాడులోని చెన్నైలో అయినప్పటికీ అతని స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా. గుకేశ్ తండ్రి రజినీకాంత్ సర్జన్. ఏడేళ్ల వయసులోనే గుకేశ్ చెస్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అదే మక్కువతో చెస్ పోటీల్లో అనేక విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఏసియన్ చెస్ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023గా రికార్డు సృష్టించాడు. తాజాగా 18 ఏళ్ల వయసులో చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

