పారిస్ : నొవాక్ జొకోవిచ్ తిరిగి టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ సమీప ప్రత్యర్థి అల్కారజ్ కంటే 380 పాయింట్లు ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచాడు. జోకోవిచ్ మొత్తం 7,160 పాయింట్లు సాధించగా, అల్కారజ్ 6,780 పాయింట్లతో ఒక స్థానం దిగజారి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. మియామి ఓపెన్ సెమీస్‌లోనే అల్కారజ్ ఓడిపోవడంతో జొకోవిచ్ తిరిగి అగ్రస్థానం చేరుకున్నాడు. స్టెఫనాస్ త్సిసిపాస్ 5,770 పాయింట్లతో మూడో స్థానంలోనే కొనసాగుతున్నాడు. కాగా డేనియల్ మెద్వెదెవ్ 5,150 పాయింట్లతో నాలుగు, కాస్పర్ రూడ్ 5,005 పాయింట్లతో అయిదో స్థానంలో నిలిచారు.