గాఫ్ సాఫీగా..
సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అమెరికా యువ సంచలనం.. కోకో గాఫ్ మూడో రౌండ్‌కు చేరింది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన గాఫ్ వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించగా.. స్టార్ ప్లేయర్లు ఒన్స్ జాబుర్, వోజ్నియాకీ రెండో రౌండ్లోనే ఇంటి బాట పట్టారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు.
- జాబుర్కు చుక్కెదురు
- జొకోవిచ్ ముందంజ
- ఆస్ట్రేలియా ఓపెన్
సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అమెరికా యువ సంచలనం.. కోకో గాఫ్ మూడో రౌండ్‌కు చేరింది. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన గాఫ్ వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించగా.. స్టార్ ప్లేయర్లు ఒన్స్ జాబుర్, వోజ్నియాకీ రెండో రౌండ్లోనే ఇంటి బాట పట్టారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు.
మెల్బోర్న్: గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సంచలన ప్రదర్శనతో టెన్నిస్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్న అమెరికా యంగ్‌గన్ కోకో గాఫ్.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో అదే జోరు కొనసాగిస్తున్నది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ గాఫ్ 7-6 (7/2), 6-2తో అమెరికాకే చెందిన డాల్హిడ్పై విజయం సాధించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఆరో సీడ్ ఒన్స్ జాబుర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలిన్ వోజ్నియాకీ రెండో రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. గాఫ్ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న గాఫ్ మ్యాచ్ మొత్తంలో మూడు ఏస్‌లు సంధిచి.. 4 డబుల్ ఫాల్ట్స్ చేసింది. 4 బ్రేక్ పాయింట్లు కాచుకున్న గాఫ్.. 20 విన్నర్లు సంధించగా.. 17 విన్నర్లకు పరిమితమైన ప్రత్యర్థి 41 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మరో మ్యాచ్‌లో జాబుర్ 0-6, 2-6తో ఆండ్రీవా చేతిలో ఓడగా.. వోజ్నియాకీ 6-1, 4-6, 1-6తో టిమోఫీఫా చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంక 6-3, 6-2తో ఫ్రువిత్రోవాపై.. క్రెజికోవా 6-2, 6-2తో కోర్పాచ్పై.. హద్దద్ మైయా 6-1, 6-2తో కొర్నీవాపై గెలుపొందారు.
జొకో జోరు: అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించడమే పనిగా ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగిన సెర్బియా వీరుడు నొవాక్ జకోవిచ్ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో బుధవారం జొకో 6-3, 4-6, 7-6 (7/4), 6-3తో పాప్రిన్పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో రుబ్లేవ్ 6-4, 6-4, 6-4తో యుబంక్స్పై.. సిట్సిపాస్ 4-6, 7-6 (8/6), 6-2 7-6 (7/4)తో థాంప్సన్పై.. సిన్నెర్ 6-2, 6-2, 6-2తో డిజాంగ్పై గెలుపొందాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

