కోవిడ్ ఔషధ కంపెనీలో జోకోవిచ్‌కు భారీ వాటా !

లండన్: వ్యాక్సిన్ వేసుకోని కారణంగా.. టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ .. ఆస్ట్రేలియా నుంచి డిపోర్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే సెర్బియా ప్లేయర్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. కోవిడ్ ఔషధ తయారీ సంస్థలో జోకోవిచ్‌కు భారీ వాటా ఉన్నట్లు ఆ కంపెనీ సీఈవో తెలిపారు. కోవిడ్ చికిత్స కోసం కొత్త తరహా ఔషధాలను డానిష్‌కు చెందిన క్వాంట్బయోరెస్ అనే కంపెనీ డెవలప్ చేస్తోంది. ఆ కంపెనీలో జోకోవిచ్, ఆయన భార్య పేరిట 80 శాతం వాటా ఉన్నట్లు క్వాంట్బయోరెస్ సీఈవో ఇవాన్ లోన్కారేవిక్ తెలిపారు. క్వాంట్బయోరెస్ కంపెనీలో డెన్మార్క్, స్లోవేనియా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌కు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో చెప్పారు.
వైరస్‌పై పోరాటంలో భాగంగా కొత్త టెక్నాలజీతో ఔషధాలను తయారు చేస్తున్నట్లు ఇవాన్ తెలిపారు. ఒకవేళ కోవిడ్‌పై సక్సెస్ అయితే, అప్పుడు ఇతర వైరస్‌లను కూడా నియంత్రించే ఔషధాలను తయారు చేయవచ్చు అన్నారు. వచ్చే ఎండాకాలంలో బ్రిటన్‌లో క్వాంటా కంపెనీ తమ ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు సీఈవో వెల్లడించారు. డెన్మార్క్‌లో జోకోవిచ్‌కు బయోటెక్ కంపెనీ ఉన్నట్లు వచ్చిన వార్తలపై ఆ ప్లేయర్ ఇంకా స్పందించలేదు. కానీ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని కారణంగా.. ఆస్ట్రేలియా నుంచి జోకోవిచ్‌ను తరిమేసిన విషయం తెలిసిందే. దీంతో అతను 21వ గ్రాండ్‌స్లామ్‌ను గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

