డీగో మారడోనా నన్ను రేప్ చేశాడు..

హవానా: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్.. దివంగత డీగో మారడోనా.. తనను రేప్ చేసినట్లు 37 ఏళ్ల మహిళ ఆరోపించింది. బ్యూనస్ఎయిరిస్లో క్యూబాకు చెందిన మావిస్ అల్వరేజ్ రీగో మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం తాను మైనర్‌గా ఉన్న సమయంలో.. ఫుట్‌బాల్ హీరో డీగో మారడోనా తనను శారీరకంగా వేధించినట్లు పేర్కొన్నది. 16 ఏళ్ల వయసులో.. మారడోనాను క్యూబాలో కలిశానని, 40 ఏళ్ల వయసులో అతను డ్రగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు దగ్గరయ్యామని, కానీ రానురాను మారడోనా తనను కొకైన్ తీసుకునేలా చేశాడని, అతనిపై ఆధారపడే విధంగా తనను మార్చేసినట్లు ఆమె ఆరోపించింది. 60 ఏళ్ల వయసులో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న మారడోనా.. గత ఏడాది మరణించిన విషయం తెలిసిందే.
మారడోనాను ప్రేమించడమే కాదు.. అతన్ని ద్వేషించినట్లు కూడా ఆమె చెప్పింది. ఓ దశలో సూసైడ్ చేసుకోవాలనిపించినట్లు ఆమె వెల్లడించింది. అర్జెంటీనాకు వరల్డ్‌కప్ అందించిన మారడోనాతో ఓ అయిదారేళ్ల పాటు అల్వరేజ్ రీగో రిలేషన్లో ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2001లో బ్యూనస్ ఎయిరిస్ వెళ్లిన తనను మారడోనా ఓ హోటల్ గదిలో బంధించాడని, కొన్ని వారాల పాటు తనను వేధించినట్లు ఆమె చెప్పింది. హవానాలోని ఇంట్లో తనను రేప్ చేసినట్లు కూడా ఆమె ఆరోపించింది. నవంబర్ 25వ తేదీన మారడోనా తొలి వర్థంతి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అల్వరేజ్ రీగో ఫిర్యాదు మరోసారి బయటకు వచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

