డివిలియర్స్ తిరిగి వస్తాడు
వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఏబీ డివిలియర్స్ జట్టులోకి వస్తాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచనప్రాయంగా తెలిపాడు. బుధవారం ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘డివిలియర్స్‌ను చాలా మిస్సయ్యాను. తరచూ అతడితో మాట్లాడుతున్నా. ప్రస్తుతం డివిలియర్స్ కుటుంబంతో కలిసి అమెరికాలో గోల్ఫ్ ఆటను చూస్తున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్నాడు. వచ్చే సంవత్సరం అతడు ఇక్కడకు (బెంగళూరు జట్టులోకి) వస్తాడని భావిస్తున్నా’ అని పేర్కొన్నాడు.
- ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ
న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ఏబీ డివిలియర్స్ జట్టులోకి వస్తాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచనప్రాయంగా తెలిపాడు. బుధవారం ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘డివిలియర్స్‌ను చాలా మిస్సయ్యాను. తరచూ అతడితో మాట్లాడుతున్నా. ప్రస్తుతం డివిలియర్స్ కుటుంబంతో కలిసి అమెరికాలో గోల్ఫ్ ఆటను చూస్తున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్నాడు. వచ్చే సంవత్సరం అతడు ఇక్కడకు (బెంగళూరు జట్టులోకి) వస్తాడని భావిస్తున్నా’ అని పేర్కొన్నాడు. అనంతరం ఈ సీజన్లో మూడు గోల్డెన్ డకౌట్స్పై స్పందిస్తూ.. ‘జీవితంలో అన్నీ చూడాలి కదా’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ‘నా కెరీర్లో ఇలాంటివి ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డివిలియర్స్.. నిరుడు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజా సీజన్‌కు ఏబీడీ.. ఆర్సీబీ జట్టులో సహాయక బృందంలో ఉంటాడని అందరూ భావించారు. కుదరకపోవడంతో వచ్చే ఏడాదైనా జట్టులో ఉంటాడని విరాట్ కోహ్లీ తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

