RCB vs GG : గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) ఓపెనర్ సోఫియా డంక్లీ (16) బౌల్డ్ అయింది. సోఫీ డెవినే వేసిన మూడో ఓవర్లో మూడో బంతికి ఫోర్ కొట్టిన ఆమె నాలుగో బంతికి బంతిని సరిగ్గా అంచనా వేయలేక ఔటయ్యింది. దాంతో, 27 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. లారా వొల్వార్డ్ (10), సబ్బినేని మేఘన క్రీజులో ఉన్నారు. సోఫీ డెవినే వేసిన తొలి ఓవర్లో డంక్లీ రెండు ఫోర్లు కొట్టింది. దాంతో, 11 రన్స్ వచ్చాయి. మూడు ఓవర్లకు గుజరాత్ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 16వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore), గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ స్నేహ్ రానా(Sneh Rana) బ్యాటింగ్ తీసుకుంది.