INDW vs PAKW | తిప్పేసిన దీప్తి.. నిప్పులు చెరిగిన రేణుకా.. పాకిస్థాన్ ఆలౌట్
INDW vs PAKW : మహిళల ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(3/20), రేణుకా సింగ్ (2/14), పూజా వస్త్రాకర్(2/31)లు చెలరేగడంతో పాకిస్థాన్ 108 పరుగులకే ఆలౌటయ్యింది.
INDW vs PAKW : మహిళల ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(3/20), రేణుకా సింగ్ (2/14), పూజా వస్త్రాకర్(2/31)లు చెలరేగడంతో పాకిస్థాన్ 108 పరుగులకే ఆలౌటయ్యింది. పవర్ ప్లేలోనే రెండు వికెట్లు తీసిన పూజా పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఆ దశలో సిడ్రా అమీన్(25), ఆఖర్లో ఫాతిమా సనా ఫాతిమా(22 నాటౌట్) దూకుడుగా ఆడారు. 20వ ఓవర్ రెండో బంతికి సదియా ఇక్బాల్(0)ను శ్రేయాంక పాటిల్ బౌల్డ్ చేయడంతో దాయాది జట్టు స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది.
టాస్ ఓడిన డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టుకు పూజా వస్త్రాకర్ ఆదిలోనే బ్రేక్ ఇచ్చింది. దంబుల్లా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే వికెట్ తీసింది. గుల్ ఫెరొజా(5)ను చేసి వికెట్ల వేట మొదలెట్టింది. ఆ తర్వాత బంతి అందుకున్న ఆమె బౌన్సర్‌తో మునీబా అలీ(11)ను బోల్తా కొట్టించి పాక్‌ను కష్టాల్లో పడేసింది. దాంతో, పాక్ 26 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
Innings Break!
Superb bowling performance from #TeamIndia! 👌 👌
3⃣ wickets for @Deepti_Sharma06
2⃣ wickets each for Renuka Singh Thakur, @shreyanka_patil & @Vastrakarp25Stay Tuned for our chase! ⌛️
Scorecard ▶️ https://t.co/30wNRZNiBJ#WomensAsiaCup2024 | #ACC | #INDvPAK pic.twitter.com/dEakxdXiUX
— BCCI Women (@BCCIWomen) July 19, 2024
ఆ దశలో సిడ్రా అమీన్(25), టుబా హసన్(22)లతో కలిసి ధాటిగా ఆడాలనుకున్న కెప్టెన్ నిడా దార్ (8)ను దీప్తి శర్మ వెనక్కి పంపింది. చివర్లో సనా ఫాతిమా పోరాటంతో పాక్ స్కోర్ ఆ మాత్రం రన్స్ చేయగలిగింది. రాధా యాదవ్ వేసిన 19వ ఓవర్లో సనా రెండు భారీ సిక్సర్లు బాదింది. దాంతో, పాక్ స్కోర్ సెంచరీ మార్క్ దాటింది.
ఇవి కూడా చదవండి
- Scholarships | కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు.. ఒకటి నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు అర్హులు
- Srisailam Temple | అంకాళమ్మకు బోనం సమర్పించిన శ్రీశైల దేవస్థానం
- Lashkar Bonalu | లష్కర్ బోనాలకు రావాలని కేసీఆర్‌కు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆహ్వానం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Husharu 2 | నక్సలైట్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హుషారు 2’ టీజర్
IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జయేశ్ రంజన్, దానకిశోర్ సహా 12 మంది బదిలీ
Upasana Konidela | తాతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల!
Sleep | శారీరకంగా అలసిపోయినా కొందరికి నిద్ర పట్టదు.. కారణం ఏమిటి..?
Scene Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్య ‘సీన్’.. నవంబర్ 6న గ్రాండ్ రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

