DC vs MI : కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ(2) ఔట్ అయింది. సైకా ఇషక్ ఓవర్లో ఆఖరి బంతికి షాట్ ఆడబోయి బౌల్డ్ షఫాలీ బౌల్డ్ అయింది. దాంతో, 8 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. మేగ్ లానింగ్ (6), అలిసే క్యాప్సే క్రీజులో ఉన్నారు. రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి ఢిల్లీ 8 పరుగులు చేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఏడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి రెండు మ్యాచుల్లో రెండొందలు కొట్టిన ఆ జట్టు బలమైన ముంబైపై భారీ స్కోర్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండు మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ సేన ఢిల్లీని నిలువరిస్తుందా? అనేది ఆసక్తికరం. ఈ మ్యాచ్‌లో లానింగ్, షఫాలీ మరోసారి రాణిస్తే ఆ జట్టు భారీ స్కోర్ చేయడం ఖాయం.