బెంగుళూరు: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లే(David Willey).. ఈ వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఇవాళ ప్రకటించారు. 2023-24 సీజన్‌కు చెందిన సెంట్రల్ కాంట్రాక్టు క్రికెటర్ల జాబితాను ఈసీబీ ప్రకటించింది. అయితే ఆ జాబితాలో విల్లే పేరు లేదు. ఇలాంటి రోజు రావాలని ఎప్పుడూ కోరుకోలేదని, చిన్నతనం నుంచి దేశానికి ఆడాలని కోరుకున్నట్లు విల్లే తన ఇన్‌స్టా పోస్టులో తెలిపాడు. 2015లో విల్లే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను 70 వన్డేల్లో 94 వికెట్లు తీసుకున్నాడు. 43 టీ20ల్లో 51 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో అతను 26 సగటుతో 627 రన్స్ చేశాడు.
— David Willey (@david_willey) November 1, 2023