రావల్పిండి: పాకిస్థాన్‌లోనూ పుష్ప మూవీ స్టెప్పులు హోరెత్తిస్తున్నాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఇప్పటికే డిజిటల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్, డ్యాన్సులు కూడా వైరల్ అవుతున్నాయి. రావల్పిండిలో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ సమయంలో పుష్ప స్టెప్స్‌తో అలరించాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ తగ్గేదే లే అంటూ సైగలు చేశాడు. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు అరుస్తున్న సమయంలో తగ్గేదే లే అంటూ వార్నర్ ఫోజులు ఇచ్చాడు. అంతే కాదు.. సామీ సామీ సాంగ్ పాటలోని స్టెప్పుల్ని కూడా వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ వ్యక్తిగతంగా 68 రన్స్ చేశాడు.
#warner #warner everywhere in the ground#PAKvAUS pic.twitter.com/C7zirMBChd
— Muhammad Nawaz 🇵🇰 (@i_mNawaz) March 5, 2022
Warner's Thumkeyy 💯😅#PAKvAUS #BabarAzam𓃵 pic.twitter.com/v8ndLGkrnA
— Muhammad Elyas (@_doctorelyas_) March 5, 2022