RCB vs CSK | డేవిడ్ సిక్సర్ల మోతకు అల్లాడిన సూపర్ కింగ్స్.. సొంతగడ్డపై ఆర్సీబీకి భారీ విజయం..!
RCB vs CSK : సొంత ఇలాకాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గర్జించింది. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటర్ల ఊచకోతకు, బౌలర్ల వికెట్ల వేట తోడవ్వగా ఆర్సీబీ పరుగులతో భారీ విజయం సాధించింది.
RCB vs CSK : సొంత ఇలాకాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గర్జించింది. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటర్ల ఊచకోతకు, బౌలర్ల వికెట్ల వేట తోడవ్వగా ఆర్సీబీ పరుగులతో భారీ విజయం సాధించింది. టిమ్ డేవిడ్(70 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్(50) మెరుపులతో కొండంత స్కోర్ కొట్టిన బెంగళూరు.. పవర్ ప్లేలోనే చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓటమి అంచుల్లోకి నెట్టింది. టాపార్డర్ కుప్పకూలిన చోట సర్ఫరాజ్ ఖాన్(50), ప్రశాంత్ వీర్(43)లు బ్యాట్ ఝులిపించారు. ఆఖర్లో జేమీ ఓవర్టన్(37) ధనాధన్ ఆడినా సరిపోలేదు. ఫలితంగా చెన్నై ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి చేరింది.
పంతొమ్మిదో సీజన్లో రికార్డు స్కోర్ బాదిన ఆర్సీబీ వరసగా రెండో విజయం నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యర్ధి నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని చూసి నీరుగారిపోయిన సూపర్ కింగ్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. బౌలర్లు విఫలమైన చోట బ్యాటర్లూ ‘మేము ఆడలేమంటూ’ చేతులెత్తేశారు.
A dream finish with the bat followed by a dream start with the ball 😍#RCB pick three early wickets but Sarfaraz Khan fights on 👊#CSK 64/3 in 5⃣ overs
Updates ▶️ https://t.co/PkhPvxcU44#TATAIPL | #KhelBindaas | pic.twitter.com/BNaIy2pugq
— IndianPremierLeague (@IPL) April 5, 2026
జాకబ్ డఫ్ఫీ వేసిన తొలి ఓవర్లో సిక్సర్ బాదిన రుతురాజ్ గైక్వాడ్(7) సులువుగా వికెట్ ఇచ్చేయగా.. గత మ్యాచ్‌లో అర్ధ శతకంతో రెచ్చిపోయిన ఆయుష్ మాత్రే(1)ను భువనేశ్వర్ ఔట్ చేశాడు. భారీ స్కోర్ బాకీ పడిన సంజూ శాంసన్ మరోసారి నిరాశపరుస్తూ 9 పరుగులకే వెనుదిరిగాడు.
సర్ఫరాజ్ మెరిసినా..
డఫ్ఫీ, భువనేశ్వర్‌ల విజృంభణతో 30 కే మూడు బిగ్ వికెట్లు పడిన వేళ సర్ఫరాజ్ ఖాన్(50), ఇంప్యాక్ట్ సబ్ కార్తిక్ శర్మ(6)లు బౌండరీలతో స్కోర్ బోర్డును నడిపించారు. అయితే.. కృనాల్ పాండ్యా(2-36) ఒకే ఓవర్లో వీరిద్దరని పెవిలియన్ పంపి చెన్నైని మరింత కష్టాల్లోకి నెట్టాడు.
5️⃣0️⃣ partnership at a crucial stage 💛
Prashant Veer 🤝 Jamie Overton
Updates ▶️ https://t.co/PkhPvxcU44#TATAIPL | #KhelBindaas | #RCBvCSK pic.twitter.com/gYLnOpl7lN
— IndianPremierLeague (@IPL) April 5, 2026
శివం దూబే(18) కాసేపు అలరించాడంతే. ప్రశాంత్ వీర్(43), జేమీ ఓవర్టన్(37)లు ఆర్సీబీ బౌలర్లను ప్రతిఘటించారు. స్కోర్ 100 దాటించి ఆరో వికెట్‌కు 57 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని డైవింగ్ క్యాచ్‌తో పాటిదార్ విడదీశాడు. కాసేపటికే ఓవర్టన్ ఇన్నింగ్స్ ముగియగా.. సీఎస్కే 207 పరుగులకే పరిమితమైంది.
ఆ ఇద్దరూ.. ఆకాశమే హద్దుగా
సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బ్యాటర్లు పూనకాలు వచ్చినట్టే చెలరేగారు. ఓపెనర్లు శుభారంభమివ్వగా.. దానికి రెండింతలు అన్నట్టు మిడిలార్డర్ బ్యాటర్లు సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల భరతం పట్టారు. ఫలితంగా ఈ సీజన్లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది ఆర్సీబీ. పవర్ ప్లేలోనే విరాట్ కోహ్లీ(28) ఔటైనా.. దేవ్‌దత్ పడిక్కల్(50) జతగా ఫిలిప్ సాల్ట్(46) స్కోర్ బోర్డును ఉరికించాడు. అర్ధ శతకానికి చేరువైన సాల్ట్‌ను దూబే వెనక్కి పంపాడు.

అనంతరం పడిక్కల్‌తో కెప్టెన్ రజత్ పాటిదార్(48 నాటౌట్) సూపర్ కింగ్స్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఓవర్టన్ ఓవర్లో స్కూప్ షాట్‌కు యత్నించిన పడిక్కల్ బౌల్డ్ అయ్యాడు. అయినా.. ఆర్సీబీ స్కోర్ వేగం తగ్గలేదు. చివరి ఐదు ఓవర్లలో టిమ్ డేవిడ్(70 నాటౌట్) ఆకాశమే హద్దుగా.. సిక్సర్లే సిక్సర్లు బాదేశాడు. 16వ ఓవర్ నుంచి మొదలైన అతడి దూకుడు చివరి ఓవర్ వరకూ కొనసాగింది. దాంతో.. ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

