Dani Alves | బ్రెజిల్ ఫుట్‌బాల్‌లో కలకలం.. లైంగిక వేధింపుల కేసులో డిఫెండర్ డానీ అరెస్ట్
డిసెంబర్ 31న బార్సిలోనా నైట్ క్లబ్లో డానీ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళ ఫిర్యాదు
Dani Alves : బ్రెజిల్ ఫుట్‌బాల్‌లో కలకలం మొదలైంది. లైంగిక వేధింపుల కేసులో బ్రెజిల్ డిఫెండర్ డానీ అల్వెస్ అరెస్ట్ అయ్యాడు. స్పెయిన్ పోలీసులు అతడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెపై లైగింక దాడికి పాల్పడినందుకు డానీని అరెస్ట్ చేశారు. అనంతరం.. లైంగిక దాడి ఆరోపణల మీద డానీని పోలీసులు ప్రశ్నించారు. ‘ఆ సమయంలో తాను ఆ క్లబ్లో కొంతమందితో కలిసి ఉన్నానని, కానీ తాను ఏ తప్పు చేయలేదని ఈ ఫుట్‌బాలర్ తెలిపాడు. నేను డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అంతేతప్ప ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించలేదు. ఆ మహిళ ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఆమెతో అసభ్యకరంగా ఎలా ప్రవర్తించగలను ?’ అని డానీ చెప్పుకొచ్చాడని స్థానిక వార్తా పత్రిక లా వాంగార్డియా వెల్లడించింది.
అసలేం జరిగిందంటే..
డిసెంబర్ 31న స్పెయిన్‌లో బార్సిలోనా నైట్ క్లబ్లో డానీ, సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె అనుమతి లేకుండా లోదుస్తుల్లో చేతులు పెట్టాడు. ఈ విషయాన్ని స్పానిష్ మీడియా బట్టబయలు చేసింది. ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డానీపై కేసు నమోదు చేశారు. 2022లో ఖతర్‌లో జరిగిన ఫిఫి వరల్డ్ కప్ ఆడిన బ్రెజిల్ జట్టులో డానీ సభ్యుడు. క్వార్టర్ ఫైనల్లో కామెరూన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్రెజిల్ తరఫున వరల్డ్ కప్‌లో ఆడిన పెద్ద వయస్కుడిగా డానీ గుర్తింపు సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

