Pat Cummins | వైభవ్ ఆట నచ్చింది.. ఇప్పుడు అతడే నా ఫేవరెట్ ప్లేయర్..!
Pat Cummins : ఐపీఎల్లో రెండో శతకంతో రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ (Viabhav Sooryavanshi)కి అభిమానులు పెరిగిపోతున్నారు. తన దూకుడైన ఆటతో ప్రత్యర్థి ఆటగాళ్ల మనసులు గెలుచుకుంటున్న వైభవ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) సైతం అభిమానిగా మారాడు.
Pat Cummins : ఐపీఎల్లో రెండో శతకంతో రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ(Viabhav Sooryavanshi)కి అభిమానులు పెరిగిపోతున్నారు. తొలి బంతి నుంచే విరుచుకుపడే ఈ హిట్టర్ ఆటకు ఫిదా అవుతున్న దిగ్గజాలు ‘వారెవ్వా .. ఏమన్న ఆడుతున్నాడా’ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. తన దూకుడైన ఆటతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల మనసులు గెలుచుకుంటున్న వైభవ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) సైతం అభిమానిగా మారాడు. శనివారం జైపూర్ 36 బంతుల్లోనే శతకం బాదిన ఈ చిచ్చరపిడుగు ఆటపై కమిన్స్ ప్రశంసలు కురిపించాడు.
పంతొమ్మిదో సీజన్లో విధ్వంసక ఆటతో ప్రపంచ స్థాయి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. దూకుడే మంత్రగా ఆడుతూ రాజస్థాన్ రాయల్స్‌కు మెరుపు ఆరంభాలిస్తున్న ఈ కుర్రాడి ఆటకు తాను వీరాభిమానినిఇ అయ్యానంటున్నాడు కమిన్స్. జైపూర్‌లో వైభవ్ కళ్లారా చూసిన ప్యాటీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ నా కొత్త ఫేవరెట్ ప్లేయర్ వైభవ్ అని పేర్కొన్నాడు.
15 YEAR OLD VAIBHAV SURYAVANSHI IS PAT CUMMINS’ NEW FAVOURITE PLAYER. 😍
Cummins said, “Vaibhav is my new favourite. I love the way he plays, it’s a great fun. He’s very impressive, the way he takes the game on”. pic.twitter.com/ZV1WvmsO1N
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2026
‘వైభవ్ నా కొత్త ఫేవరెట్ క్రికెటర్. అతడు బంతిని బలంగా కొడుతున్నాడు. అతడి ఆట చూడడం చాలా అద్భుతంగా అనిపించింది. బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలి. బౌలింగ్ లయ తప్పితే బంతి ఎక్కడికో వెళ్తుంది. వైభవ్ ఆట నన్ను ఆకట్టుకుంది. అతడు కెరీర్‌ను చాలా గొప్పగా మొదలెట్టాడు. వైభవ్ ఆడే విధానం నాకు చాలా నచ్చింది. అతడు మ్యాచ్‌ను చేతుల్లోంచి లాగేసుకుంటాడు’ అని కమిన్స్ వైభవ్‌పై ప్రశంసలు కురిపించాడు.
వైభవ్ సెంచరీ వృథా
పంతొమ్మిదో సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు చూపిస్తోంది. ఉప్పల్‌లో హ్యాట్రిక్ విజయాలకు కొనసాగింపుగా జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ(103) రికార్డు సెంచరీతో సవాల్ విసిరిన ఆతిథ్య జట్టుపై ఇషాన్ కిషన్(74), అభిషేక్ శర్మ(57) పిడుగల్లే విరుచుకుపడ్డారు. అర్ధ శతకాలతో గెలపు పునాది వేసిన ఈ ఇద్దరూ వెంటవెంటనే ఔటైనా హెన్రిచ్ క్లాసెన్(29), నితీశ్ రెడ్డి(36)లు దూకుడుగా ఆడి సన్‌రైజర్స్‌కు నాలుగో విజయం కట్టబెట్టారు.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

