IPL 2024 | స్వదేశానికి ముస్తాఫిజుర్.. చెన్నైకి షాక్ తప్పదా..?
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మూడో విజయంపై కన్నేసింది. ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరుగబోయే మ్యాచ్‌కు ముందే ఆ జట్టుకు భారీ షాక్ తగలనుంది. ఈ సీజన్లో అదరగొడుతున్న స్టార్ పేసర్...
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మూడో విజయంపై కన్నేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad)తో మ్యాచ్ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సీఎస్కే ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌కు ముందే ఆ జట్టుకు భారీ షాక్ తగలనుంది. ఈ సీజన్లో అదరగొడుతున్న స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Rahman) కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే చాన్స్ ఉంది.
అమెరికా వీసా, బయోమెట్రిక్ కోసం ఈ స్పీడ్‌స్టర్ స్వదేశాని(బంగ్లాదేశ్)కి వెళ్లనున్నాడు. అయితే.. అతడు తిరిగి జట్టుతో కలవడానికి నాలుగైదు రోజులు పట్టొచ్చు. అదే జరిగితే ఏప్రిల్ 8వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు సైతం ముస్తాఫిజుర్ దూరమయ్యే చాన్స్ ఉంది.
Masth-e-fizur! 🥳🔥#DCvCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/aYPMzxw4Dn
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024
ఐపీఎల్ పదిహోడో సీజన్ ఆరంభానికి ముందు గాయపడిన ముస్తాఫిజుర్ వేగంగా కోలుకొని చెన్నైకి వచ్చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీపై సంచలన ప్రదర్శనతో మెరిశాడు. 4 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. అంతేకాదు ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై కూడా ముస్తాఫిజుర్ రెండు వికెట్లతో రాణించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో ఈ పేస్‌గుర్రం ఒకే వికెట్‌తో సరిపెట్టుకున్నాడు. దాంతో, టీ20లో అతడు 300 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

