Cristiano Ronaldo | అబా(సౌదీ అరేబియా): సౌదీ ప్రొ లీగ్‌లో స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సూపర్ ఫామ్ దిగ్విజయంగా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్ నాసర్ తరఫున రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. ప్రత్యర్థి టీమ్ అబాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ రొనాల్డో విజృంభించడంతో ఆల్ నాసర్ 8-0 తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన రొనాల్డో ప్రథమార్ధంలోనే మూడు గోల్స్‌తో పాటు రెండు గోల్స్‌లో పాలుపంచుకున్నాడు. ఈ సీజన్లో రొనాల్డోకు ఇది మూడో హ్యాట్రిక్.