పన్నెండేండ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్‌కు తిరిగొచ్చిన స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో బుధవారం ఆ జట్టు జెర్సీని ధరించి మురిసిపోయాడు. ఎరుపు రంగు జెర్సీ వేసుకుని ఫోజులిచ్చిన అతడి ఫొటోలను మాంచెస్టర్ ఎఫ్‌సీ ట్విట్టర్లో షేర్ చేసింది. రొనాల్డోకు ఇంకా జెర్సీ నంబర్ కేటాయించలేదు. అతడు త్వరలోనే జట్టుతో కలువనున్నాడు.