మాంచెస్టర్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్‌కు తిరిగొచ్చాడు. పన్నేండేండ్ల తర్వాత అతడు మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ఆడనున్నాడు. ఇందుకు సంబంధించిన ఒప్పందం మంగళవారం పూర్తయింది. ఇటలీకి చెందిన జువెంటస్ టీమ్ తరఫున ఆడిన రొనాల్డో.. మాంచెస్టర్‌కు బదిలీ అయినట్టు వెలువడగానే హర్షం వ్యక్తం చేశాడు. ఒప్పందంలో భాగంగా రెండేండ్ల పాటు అతడు మాంచెస్టర్‌కు ఆడనున్నాడు. ఇందుకు గాను అతడికి ప్రతి యేటా 15 మిలియన్ యూరోలు (సుమారు రూ. 129 కోట్లు) దక్కనున్నాయి. వీటితో పాటు అదనంగా మరో 8 మిలియన్ యూరోలు (రూ. 69 కోట్లు) కూడా యాడ్-ఆన్స్ రూపంలో ముట్టనున్నాయి. ఈ సందర్భంగా రొనాల్డో స్పందిస్తూ.. ‘మాంచెస్టర్ క్లబ్‌కు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ నిర్ణయం వెలువడ్డ నుంచి నాకు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి’ అని రొనాల్డో చెప్పాడు.