రొనాల్డో ప్రపంచ రికార్డు
- అత్యధిక గోల్స్ ఘనత సొంతం

పారిస్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక గోల్స్ (111) కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. గురువారం ఐర్లాండ్‌తో జరిగిన అర్హత మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టిన రొనాల్డో.. ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ 2-0 తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. ఈ రెండు గోల్స్ రొనాల్డో కొట్టినవే కావడం గమనార్హం. మ్యాచ్ 89వ నిమిషంలో గోల్ కొట్టిన క్రిస్టియానో.. ఇరాన్ ఫుట్‌బాల్ మాజీ దిగ్గజం అలీ దాయి (109) పేరిట ఉన్న అత్యధిక గోల్స్ రికార్డును అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరో ఆరు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా హెడర్‌తో మరో గోల్ కొట్టి పోర్చుగల్‌ను విజయతీరాలకు చేర్చాడు. 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం అతడు స్పందిస్తూ.. ‘నాకెంతో సంతోషంగా ఉంది. ఆట చివర్లో గోల్స్ కొట్టడం, మ్యాచ్‌లను గెలిపించడాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాను. మా జట్టు అద్భుతంగా ఆడింది. ఆఖరి వరకు మేం గెలుస్తామనే నమ్మాం’ అని అన్నాడు.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

