ఇన్‌స్టాలో 30 కోట్ల మంది ఫాలోవర్లు.. రొనాల్డో మరో రికార్డు

లిస్బన్: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో రికార్డు సృష్టించాడు. 30 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి వ్యక్తిగా నిలిచాడు. గతంలో ఇదే ఇన్‌స్టాలో 20 కోట్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి వ్యక్తిగా కూడా రొనాల్డో నిలవడం విశేషం. ఈ మధ్యే యూరో 2020లో భాగంగా హంగరీతో మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తనకు ఫ్యాన్ ఫాలోయింగ్‌లోనూ తిరుగు లేదని నిరూపించాడు. శుక్రవారం ఈ అరుదైన 30 కోట్ల ఫాలోవర్ల రికార్డును రొనాల్డో అందుకున్నాడు.
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల లిస్ట్‌లో రొనాల్డో తర్వాత రెజ్లర్ డ్వేన్ ద రాక్ జాన్సన్, మ్యుజీషియన్ అరియానా గ్రాండె, కైలీ జెన్నర్, సెలీనా గోమెజ్ ఉన్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అతనికి ఇన్‌స్టాలో 12.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతని తర్వాత ప్రియాంకా చోప్రాకు 6.45 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

