Cristiano Ronaldo: 12 ఏళ్ల తర్వాత మాంచెస్టర్‌కు తిరిగొచ్చిన రొనాల్డో.. కుదిరిన కాంట్రాక్ట్
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో( Cristiano Ronaldo ).. పదేళ్ల తర్వాత మళ్లీ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు తిరిగొచ్చాడు.

లండన్: పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో( Cristiano Ronaldo ).. పదేళ్ల తర్వాత మళ్లీ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు తిరిగొచ్చాడు. ఇటలీకి చెందిన జువెంటస్ టీమ్ నుంచి అతని బదిలీ పూర్తయింది. రొనాల్డోతో రెండేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్న మాంచెస్టర్ యునైటెడ్.. ఇందుకుగాను అతనికి 1.5 కోట్ల యూరోలు (సుమారు రూ.129 కోట్లు) చెల్లించనుంది. అదనంగా 80 లక్షల యూరోలు (సుమారు రూ.69 కోట్లు) కూడా యాడ్-ఆన్స్ రూపంలో అతనికి దక్కే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి రెండేళ్లపాటు ఉన్న ఈ కాంట్రాక్ట్‌ను మరో ఏడాది పొడిగించే అవకాశంతో రొనాల్డో దానిపై సంతకం చేశాడు.
మాంచెస్టర్ యునైటెడ్ టీమ్‌కు తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని ఈ సందర్భంగా రొనాల్డో అన్నాడు. గతంలో ఈ టీమ్ తరఫున 292 మ్యాచ్‌లు ఆడి 118 గోల్స్ చేశాడు. ఆ తర్వాత 2009లో రియల్ మాడ్రిడ్‌కు మారాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మరోసారి ఆడటానికి తాను ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు రొనాల్డో చెప్పాడు. రొనాల్డో గురించి వర్ణించడానికి మాటలు చాలవని అటు యునైటెడ్ మేనేజర్ ఓల్ గన్నర్ అన్నాడు. ఆరు సీజన్లపాటు యునైటెడ్‌కు ఆడిన రొనాల్డో.. మూడు ప్రిమియర్ లీగ్ టైటిల్స్ సాధించిపెట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Endowments | దేవాదాయ శాఖలో అతనొక్కడే.. అన్ని విషయాల్లో అంతా తానే అయిన ఆ శాఖ సలహాదారు!
Hyderabad Metro | మెట్రో రైలు టేకోవర్‌పై నీలినీడలు.. నిధుల సమీకరణలో వైఫల్యం.. అప్పుల కోసం అగచాట్లు
Raj Gopal Reddy | పైసలివ్వనిదే ఫైలు కదుల్తలేదు.. పంచాయతీ సెక్రటరీ నుంచి సీఎస్ వరకు ఇదే దుస్థితి: రాజగోపాల్‌రెడ్డి
Education Commission | పదవీకాలం ముగిసినా పదవులు వీడరా? విద్యా కమిషన్ ఆఫీసే సొంత అడ్డా!
కాంగ్రెస్ సర్కార్ గుండెలదిరేలా గర్జించిన రైతన్న
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

