40 కోట్లిస్తేనే మీ జట్టులో ఉంటాం!
వ్యాపారపరంగా ప్రపంచస్థాయి లీగ్‌లను దాటేస్తూ బీసీసీఐ, ఫ్రాంచైజీలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్లో 2028 సీజన్ నుంచి జట్లకు కొత్త తలనొప్పులు ఎదురుకానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
- పలువురు టాప్ క్రికెటర్ల డిమాండ్
- ఫ్రాంచైజీలకు కొత్త తలనొప్పులు
ఢిల్లీ: వ్యాపారపరంగా ప్రపంచస్థాయి లీగ్‌లను దాటేస్తూ బీసీసీఐ, ఫ్రాంచైజీలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్లో 2028 సీజన్ నుంచి జట్లకు కొత్త తలనొప్పులు ఎదురుకానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్, అంతకుమించి ఈ లీగ్‌కు ఉన్న ఆకర్షణ, స్థాయి దృష్ట్యా పలువురు టాప్ క్రికెటర్లు ఆయా ఫ్రాంచైజీలతో కొనసాగడానికి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తుండటమే ఇందుకు కారణం. మెగా వేలానికి (2028లో) ముందు జట్లన్నీ తాము రిటైన్ చేసుకునే నాలుగు లేదా ఐదుగురు ఆటగాళ్ల జాబితాలో ఉన్న కీలక ప్లేయర్లలో కొందరు తమకు రూ. 40 కోట్లిస్తేనే మీ జట్టుతో ఉంటామని ఫ్రాంచైజీలను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఐపీఎల్ 2025 వేలంలో రిషభ్ పంత్‌కు దక్కిన రూ. 27 కోట్లే ఇప్పటిదాకా లీగ్‌లో అత్యధిక ధర. అయితే సదరు క్రికెటర్లు డిమాండ్ చేస్తున్న భారీ కాంట్రాక్టుల కోర్కెలు తీరాలంటే మాత్రం పలు కీలక అంశాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఐపీఎల్లో ఒక టీమ్ పర్స్ వాల్యూ రూ. 120 కోట్లుగా ఉంది. 2028 సీజన్ నుంచి దీనిని రూ. 150 కోట్లకు పెంచుతారని చర్చలు సాగుతున్నాయి. ఇలా చూసుకుంటే ఒక ప్లేయర్‌కు రూ. 40 కోట్లు అనేది ఫ్రాంచైజీలకు కాస్త ఎక్కువే అయినా పర్స్ విలువపరంగా చూస్తే అది వాస్తవరూపం దాల్చే విషయమే.
బీసీసీఐ నిబంధనల ప్రకారం పర్స్ వాల్యూ రూ. 120 కోట్లు ఉన్నప్పుడు (ప్రస్తుతం) జట్లు మెగా వేలానికి ముందు తీసుకునే నలుగురు లేదా ఐదుగురు మార్క్యూ ప్లేయర్ల సాలరీ మొత్తం విలువలో రూ. 75 కోట్లకు మించరాదు. ఒకవేళ పర్స్ వాల్యూ పెరిగితే ఈ లెక్క (రూ. 75 కోట్ల పరిమితి) కూడా పెరుగుతుంది కావున ఒక ఆటగాడికి రూ. 40 కోట్లు అనేది జట్లకు పెద్ద విషయం కాదు. కాగా పర్స్ వాల్యూ అంశం ఐపీఎల్ మీడియా రైట్స్తోనూ లింక్ అయి ఉన్నందున దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటందనేది ఆసక్తికరం. రిటెన్షన్ రూల్స్, ఫ్రాంచైజీలు ఎంచుకునే ప్లేయర్ల సంఖ్య వంటి వాటిపై ఆధారపడి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

