Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
Cricketer Jehangir | మైదానంలో అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా ఓ క్రికెటర్ సహనం కోల్పోయాడు. ఏకంగా ఓ అభిమానిపై దాడికి దిగాడు. కిందపడేసి మరీ కొట్టాడు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ బక్షి స్టేడియంలో రెడ్ ప్రీమియర్ లీగ్ (RPL) సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Cricketer Jehangir | మైదానంలో అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా ఓ క్రికెటర్ సహనం కోల్పోయాడు. ఏకంగా ఓ అభిమానిపై దాడికి దిగాడు. కిందపడేసి మరీ కొట్టాడు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ బక్షి స్టేడియంలో రెడ్ ప్రీమియర్ లీగ్ (RPL) సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ కశ్మీరీ క్రికెటర్ జహంగీర్ లోన్ ఓ అభిమానిపై దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆదివారం అథ్వాస్ ఇండియా XI, రాయల్ గుడ్‌విల్ సీసీ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో అథ్వాస్ ఇండియా XI మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత గెలిచిన జట్టు అభిమానులు మైదానంలోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో రాయల్ గుడ్‌విల్ సీసీ తరఫున ఆడిన జహంగీర్ లోన్‌కు ఓ అభిమానితో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో తెల్లటి స్వెట్‌షర్ట్, జీన్స్ ధరించిన ఓ వ్యక్తితో జహంగీర్ ఘర్షణకు దిగినట్లు కనిపిస్తోంది. అతడిని తోసేస్తూ, పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేసినట్లు వీడియోల్లో ఉంది. సహచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఎందుకు కొట్టాడో వివరించిన క్రికెటర్
ఈ ఘటనపై స్థానిక మీడియాతో జహంగీర్ లోన్ స్పందించాడు. మ్యాచ్‌లో ఓడిపోయిన అనంతరం తమ జట్టు ఆటగాళ్లు పెవిలియన్‌కు వెళ్తుండగా ప్రత్యర్థి జట్టు అభిమానులు మైదానంలోకి వచ్చి తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించాడు. తన తల్లిని ఉద్దేశించి కూడా అవమానకర వ్యాఖ్యలు చేయడంతో సహనం కోల్పోయి దాడికి దిగినట్లు చెప్పాడు. తన కుటుంబాన్ని అవమానించడాన్ని సహించలేనని పేర్కొన్నాడు.
వీడియో వైరల్ అయిన కొన్ని గంటల తర్వాత జహంగీర్ సోషల్ మీడియాలో ‘My Family! My Pride’ అంటూ పోస్టు చేశాడు. ఈ ఘటనపై క్రీడాభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రికెటర్ ప్రవర్తనను పలువురు ఖండిస్తూ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు అతడిని రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

