Cricket: మిస్టర్ 360కి దగ్గర్లో ఉన్నావ్… సూర్యకుమార్‌కు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ మెచ్చుకోలు
మిస్టర్ 360 ప్లేయర్‌గా ప్రశంసలు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్
క్రికెట్లో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివీలియర్స్ని మిస్టర్ 360 అని పిలుస్తారంతా. స్టేడియం నలువైపులా షాట్లు ఆడడం, వేగంగా పరుగులు సాధించడంలో అతను దిట్ట. అలాంటి టెక్నిక్ అతనికి మాత్రమే సొంతం అనుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన ఆటతీరుతో డివీలియర్స్ని తలపిస్తున్నాడు. సూపర్ 12 స్టేజీలో జింబాబ్వేపై సూర్య కుమార్ ఇన్నింగ్స్ (61 నాటౌట్) చూశాక అతడిని ఈతరం 360 ప్లేయర్ అంటున్నారు కొందరు మాజీ ఆటగాళ్లు. భారతజట్టు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, సూర్యని 360 డిగ్రీ ప్లేయర్ అని ఆకాశానికెత్తేశాడు. పఠాన్ కామెంట్‌కి బదులిస్తూ సూర్య 360 ప్లేయర్ తాను కాదని, డివీలియర్స్ అని చెప్పాడు .
‘ఈ ప్రపంచంలో 360 ఆటగాడు ఒక్కరే ఉన్నారు. అతడిలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నా’ అన్నాడు సూర్య కుమార్ యాదవ్. తన గురించి సూర్య చేసిన కామెంట్ మీద డివీలియర్స్ స్పందించాడు. ‘నువ్వు చాలా తొందరగా మిస్టర్ 360 ప్లేయర్‌గా ఎదుగుతున్నావు. జింబాంబ్వేపై 360 ప్లేయర్ కంటే చాలా గొప్పగా ఆడావు’ అని సూర్యని ప్రశంసించాడు డివిలియర్స్. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. తనకు మాత్రమే సొంతమైన షాట్లతో అలరిస్తున్నాడు. దాంతో, మాజీ క్రికెటర్లు సూర్య బ్యాటింగ్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. డివిలియర్స్ ఐపీఎల్‌ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

