సిడ్నీ: రాబోయే 2026-27 సీజన్‌కు గాను క్రికెట్ ఆస్ట్రేలియా తమ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏడాది మొత్తం కంగారూలు బిజీ షెడ్యూల్‌తో గడుపనున్నారు. ఏడాది వ్యవధిలో ఆ జట్టు ఏకంగా 20 (డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయితే 21) టెస్టులు ఆడనుంది. ఇందులో 7 స్వదేశంలో కాగా మిగిలినవి ప్రత్యర్థుల దేశాల్లో ఆడుతుంది.
ఈ ఏడాది ఆగస్టులో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌తో ఆ జట్టు బిజీ షెడ్యూల్ ఆరంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాలో మూడు టెస్టులు ఆడి డిసెంబర్-జనవరిలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. 1999 తర్వాత కివీస్‌తో ఆ జట్టు 4 టెస్టుల సిరీస్ ఆడనుండటం ఇదే మొదటిసారి. ఇక జనవరిలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత్‌కు రానుంది.