మెల్బోర్న్ : ఆస్ట్రేలియా మాజీ టెన్నిస్ ప్లేయర్ ఆశ్లే బార్టీ మళ్లీ కోర్టులో అడుగుపెట్టేది లేదని నిర్దంద్వంగా స్పష్టం చేసింది. సోమవారం మెల్బోర్న్ పార్క్‌లో తన స్వీయచరిత్ర పుస్తకం ‘మై డ్రీమ్ టైమ్’ ఆవిష్కరణ సమయంలో విలేకరులతో మాట్లాడుతూ తాను టెన్నిస్లోగానీ, మరే ఇతర క్రీడలో గానీ ప్రవేశించడం లేదని వెల్లడించింది. టెన్నిస్‌లోకి ప్రవేశించకముందు బార్టీ క్రికెటర్‌గానూ రాణించింది. టెన్నిస్‌కు సంతోషంగా వీడ్కోలు పలికానని, ఇప్పుడు గృహిణిగా సంతోషంగా ఉన్నానని తెలిపింది. గత జూలైలో బార్టీ తన టెన్నిస్ భాగస్వామి గారీకి సిచ్‌ను వివాహం చేసుకున్నది. ప్రస్తుతం ఆమె స్థానిక యువ క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నది.