న్యూఢిల్లీ : కామన్వెల్త్ క్రీడల లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్ విదేశీ శిక్షణకు కేంద్ర క్రీడా శాఖ ఆమోదం తెలిపింది. శ్రీశంకర్ త్వరలో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, వచ్చే యేడాది ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు ఒక నెలపాటు గ్రీస్‌లో శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాడు. కోచ్ మురళీతోపాటు గ్రీస్‌లో 32 రోజుల శిక్షణకు టాప్స్ కింద శ్రీశంకర్‌కు ఆర్ధిక సాయానికి కేంద్ర క్రీడా శాఖలోని మిషన్ ఒలింపిక్ సెల్(ఎంఓసీ) అంగీకరించింది.