Anderson vs Gill | నా బౌలింగ్‌లోనే సిక్స్ కొడతావా.. నువ్వైతే ఇంగ్లండ్ రా.. చూస్కుందాం..!
Anderson vs Gill | ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడిన సిక్సర్ మాత్రం గిల్ ఇన్నింగ్స్‌కే హైలైట్. గిల్ సిక్సర్ కొట్టాక అండర్సన్ ఇచ్చిన లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై
Anderson vs Gill | టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో దారుణంగా విఫలమైన అతడు వైజాగ్ టెస్టు నుంచి పుంజుకున్నాడు. ఆ టెస్టులో సెంచరీ చేసిన గిల్.. తాజాగా ధర్మశాలలోనూ శతకాన్ని సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశాడు. 150 బంతుల్లో 110 పరుగులు చేసిన గిల్ సెంచరీలో 12 బౌండరీలు, 5 భారీ సిక్సర్లున్నాయి. ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడిన సిక్సర్ మాత్రం గిల్ ఇన్నింగ్స్‌కే హైలైట్. గిల్ సిక్సర్ కొట్టాక అండర్సన్ ఇచ్చిన లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రెండో రోజు ఆట ప్రారంభమయ్యాక భారత ఇన్నింగ్స్‌లో 34వ ఓవర్ వేసిన అండర్సన్ బౌలింగ్‌లో తొలి బంతికి గిల్ ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి స్ట్రెయిట్ సిక్సర్ బాదాడు. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ కూడా ఈ షాట్‌ను చూసి అబ్బురపడ్డాడు. ఇదే విషయమై మ్యాచ్ విశ్లేషణ సమయంలో జహీర్ ఖాన్ మాట్లాడుతూ… ‘‘గిల్ అతడి సహజమైన ఆట ఆడుతున్నాడు. ఫస్ట్ టెస్టులో అతడు డిఫెన్సివ్ మైండ్‌సెట్‌తో ఉన్నాడు. కానీ ఆ తర్వాత అతడు పుంజుకున్న తీరు అద్భుతం. రోహిత్, ద్రావిడ్ అతడికి అండగా నిలిచారు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో అతడు ఆడిన షాట్ అద్భుతం…
ఒక పేసర్ బౌలింగ్‌లో అలాంటి షాట్ ఆడటం మాములు విషయం కాదు. అది సరిగ్గా కనెక్ట్ అయింది గానీ మిస్ అయితే అతడు అలాంటి షాట్ ఆడినందుకు గిల్‌పై విమర్శల జడివాన కురిసేది. అయితే ఆ షాట్ చూశాక అండర్సన్.. ‘సరే సరే నా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టావు కదా. నువ్వైతే ఇంగ్లండ్‌కు రా.. చూస్కుందాం’ అని అనుకుని ఉంటాడు..’’ అని కామెంట్స్ చేశాడు.
SHOT OF THE MATCH. 🤯
– Shubman Gill smashed Anderson over the head for a six. pic.twitter.com/73BgI4QbyZ
— Johns. (@CricCrazyJohns) March 8, 2024
అండర్సన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన గిల్.. సెంచరీ తర్వాత అతడి బౌలింగ్‌లోనే బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొట్టాడు. కానీ దురదృష్టవశాత్తూ గిల్.. అండర్సన్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అవడం కొసమెరుపు. అండర్సన్‌కు టెస్టులలో ఇది 699వ వికెట్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

