రొనాల్డో దెబ్బ.. కోకాకోలాకు 30 వేల కోట్ల నష్టం!

బుడాపెస్ట్: సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్‌కు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం మరేదీ ఉండదేమో. సెకన్ల పాటు కనిపించి ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేసినందుకు వాళ్లకు కోట్లకు కోట్లు ఎందుకిస్తారో అభిమానులకు ఇప్పుడు మరింత స్పష్టంగా తెలిసొచ్చింది. ప్రమోట్ చేయడమే కాదు వాళ్లు వద్దని చెబితే ఆ బ్రాండ్‌కు ఎంత దెబ్బో కూడా తాజాగా వెల్లడైంది. మొన్న పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చేసిన పని ఇప్పుడు కోకాకోలా కంపెనీని భారీగానే దెబ్బ తీసింది. యూరోకప్‌లో హంగరీతో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన ముందున్న కోలా బాటిల్స్‌ను తీసి పక్కన పెట్టిన రొనాల్డో.. వాటి కంటే నీళ్లు తాగడానికి ప్రాధాన్యత ఇవ్వండని అన్నాడు.
అతడు ఇచ్చిన ఈ సందేశం కోకాకోలా కంపెనీకి భారీ నష్టం తీసుకొచ్చింది. డైలీ స్టార్ అనే పత్రిక కథనం ప్రకారం ఈ ఘటన తర్వాత కోకాకోలా కంపెనీ విలువ 1.6 శాతం పడిపోయింది. 242 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ విలువ దెబ్బకు 238 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే 400 కోట్ల డాలర్లు (సుమారు రూ.30 వేల కోట్లు) నష్టపోయింది. ప్రపంచంలోని మేటి అథ్లెట్లలో ఒకడైన రొనాల్డో.. ఇలాంటి సాఫ్ట్డ్రింక్స్ను ప్రోత్సహించడు. జంక్ ఫుడ్‌కు కూడా దూరంగా ఉంటాడు. అయితే దానిని పబ్లిగ్గా, కోట్ల మంది చూసే ప్రెస్మీట్లో వ్యక్తపరచడంతో కోకాకోలా కంపెనీకి నష్టాన్ని తీసుకొచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

