Smriti and Palash: స్మృతి పెళ్లి వివాదంతో సంబంధం లేదు.. ప్రకటించిన లేడీ కొరియోగ్రాఫర్లు
Smriti and Palash: స్మృతి మంధానా, పలాశ్ ముచ్చల్ పెళ్లి ఆగిపోవడానికి తాము కారణం కాదు అని ఇద్దరు కొరియోగ్రాఫర్లు ప్రకటించారు. నందికా ద్వివేది, గుల్మాజ్ ఖాన్ తమ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు.
న్యూఢిల్లీ: మహిళా క్రికెటర్ స్మృతి మంధానా(Smriti Mandana), మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్(Palash Muchhal) పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. స్మృతి తండ్రి ఆస్పత్రిలో చేరడంతో.. అకస్మాత్తుగా పెళ్లి నిలిపివేశారు. అయితే ఓ కొరియోగ్రాఫర్‌ను పలాశ్ చీట్ చేసినట్లు ఆరోపణలు రావడంతో పెళ్లి ఆగిపోయి ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. సోషల్ మీడియాలో పలువురు అమ్మాయిల పేర్లు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నందికా ద్వివేది, గుల్నాజ్ అనే ఇద్దరు కొరియోగ్రాఫర్లు పబ్లిక్ స్టేట్మెంట్ జారీ చేశారు. తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. డ్యాన్సర్ నందిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిపై వివరణ ఇచ్చింది. స్మృతి మంధానా, పలాశ్ ముచ్చల్ మ్యారేజ్ వివాదంతో తనకు సంబంధం లేదని చెప్పింది. ఒకరి రిలేషన్‌ను దెబ్బతీసినట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని ఆమె పేర్కొన్నది. తప్పుడు పుకార్లు తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసినట్లు ఆమె పేర్కొన్నది.
మరో కొరియోగ్రాఫర్ గుల్నాజ్ కూడా తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది. స్మృతి, పలాశ్ పెళ్లి వాయిదా పడటానికి తనకు సంబంధం లేని అంశమని పేర్కొన్నది. సరిగా పెళ్లి రోజు ఉదయమే స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత రోజు పలాశ్ కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. తండ్రి ఆస్పత్రిలో చేరడంతో.. క్రికెటర్ స్మృతి తన ఇన్‌స్టా అకౌంట్లో ఉన్న పలాశ్ వీడియోలను డిలీట్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

