మనీశ్‌పాండే, అశ్రిత దూరం దూరం!
టీమ్ఇండియా క్రికెటర్ల వైవాహిక జీవితం ఒడిదొడుకుల పయనంగా సాగుతున్నది. ఇప్పటికే స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాన్కోవిచ్తో తెగదెంపులు జరుగగా, యజువేంద్ర చాహల్, ధనశ్రీ మధ్య విబేధాలు పొడచూపగా, తాజాగా మరో జంట ఈ జాబితాలో చేరింది.
బెంగళూరు: టీమ్ఇండియా క్రికెటర్ల వైవాహిక జీవితం ఒడిదొడుకుల పయనంగా సాగుతున్నది. ఇప్పటికే స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాన్కోవిచ్తో తెగదెంపులు జరుగగా, యజువేంద్ర చాహల్, ధనశ్రీ మధ్య విబేధాలు పొడచూపగా, తాజాగా మరో జంట ఈ జాబితాలో చేరింది. మనీశ్‌పాండే, అశ్రిత శెట్టి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకరికొకరు సోషల్‌మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకోవడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది. 2019 డిసెంబర్ 2 ఒక్కటైన మనీశ్, అశ్రిత గత కొన్ని రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. అశ్రిత తన సోషల్‌మీడియాలో మనీశ్ ఫొటోలు తీసేయగా, మనీశ్ కూడా అదే పని చేస్తూ అన్‌ఫాలో చేశాడు. టీమ్ఇండియా తరఫున 29వన్డేలు, 39 టీ20లు ఆడిన మనీశ్ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఐదు మ్యాచ్‌లు ఆడి 117 పరుగులకే పరిమితమయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

