Carlos Alcaraz | ఇండియన్ వెల్స్: ఇండియన్ వెల్స్ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారజ్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి(భారత కాలమానం)జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కారజ్ 7-6(5), 6-1తో డానిల్ మెద్వదెవ్‌పై అద్భుత విజయం సాధించాడు. ఈ క్రమంలో వరుసగా రెండో ఏడాది ఇండియన్ వెల్స్ ట్రోఫీని అల్కారజ్ సొంతం చేసుకున్నాడు. దీనికి తోడు గతేడాది వింబుల్డన్ గెలిచిన తర్వాత ఈ స్పెయిన్ బుల్‌కు ఇది తొలి టైటిల్. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియాటెక్ 6-4, 6-0తో మారియా సకారీపై అలవోక విజయంతో ట్రోఫీని ముద్దాడింది.