వాన్కోవర్: ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup)లో కెనడా తొలి విక్టరీ నమోదు చేసింది. టోర్నమెంట్‌కు కోహోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆ దేశం ఇవాళ ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 6-0 గోల్స్ తేడాతో ఖతార్‌పై విజయం సాధించింది. కెనడా ప్లేయర్ జోనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఈ విక్టరీతో కెనడా ఖాతాలో నాలుగు పాయింట్లు వచ్చేశాయి. గ్రూపు బీ నుంచి కెనడా నాకౌట్ దశకు చేరుకునే ఛాన్సు ఉంది. బోస్నియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్ చేసిన కెనడా ప్లేయర్ సైల్ లారిన్.. వాన్కోవర్ మ్యాచ్‌లో కూడా ఆ దేశానికి ఫస్ట్ గోల్ అందించాడు. అతను 16వ నిమిషంలో గోల్ చేశాడు. ఆ తర్వాత డేవిడ్ చెలరేగిపోయాడు. 29, 45, 90 నిమిషాల్లో డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. కెనడా జట్టులో సలిబా, మనాయి ఓజీ కూడా గోల్స్ చేశారు. స్వంత గడ్డపై హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన ప్లేయర్‌గా జోనాథన్ డేవిడ్ నిలిచారు. గతంలో 1966లో ఇంగ్లండ్ ప్లేయర్ జెఫ్ హస్ట్ స్వదేశీ మైదానంలో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు.
కెనడా జట్టు భారీ విజయం సాధించినా.. ఆ జట్టుకు ఆనందం లేకుండాపోయింది. మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కోన్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతను ఆట మధ్యలోనే స్ట్రెచర్‌పై మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఖతార్ మిడ్ ఫీల్డర్ ఆసిమ్ మడిబో తన కాలితో గట్టిగా తాకడంతో కోన్ ఎడమకాలి ఎముక విరిగిపోయింది. తీవ్రమైన నొప్పితో మైదానంలో కోన్ పడిపోయాడు. కాలి ఎముక విరిగడం వల్ల అతని సర్జరీ చేస్తున్నారు.ఈ ఘటనలో ఖతార్ ప్లేయర్ మడిబోకు రెడ్ కార్డ్ ఇచ్చారు. సుమారు నాలుగు నెలల పాటు కెనడా ప్లేయర్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.