రూ.25.20 కోట్లు 24 పరుగులు.. ఐపీఎల్లో గ్రీన్ అట్టర్ ఫ్లాప్!
కామెరూన్ గ్రీన్.. ఐపీఎల్లో అత్యధిక ధర(రూ.25.20 కోట్లు) పలికిన విదేశీ ప్లేయర్. మూడు సార్లు చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఏరికోరి కోట్లు గుమ్మరించి వేలంలో కొనుక్కున్నది. ఎవరూ ఊహించని రీతిలో రికార్డు ధరకు గ్రీన్‌ను తమ జట్టులోకి తీసుకున్న కోల్‌కతాకు ఐపీఎల్ మొదలైన తర్వాత జ్ఞానబోధ అవుతున్నది.
- నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
కామెరూన్ గ్రీన్.. ఐపీఎల్లో అత్యధిక ధర(రూ.25.20 కోట్లు) పలికిన విదేశీ ప్లేయర్. మూడు సార్లు చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఏరికోరి కోట్లు గుమ్మరించి వేలంలో కొనుక్కున్నది. ఎవరూ ఊహించని రీతిలో రికార్డు ధరకు గ్రీన్‌ను తమ జట్టులోకి తీసుకున్న కోల్‌కతాకు ఐపీఎల్ మొదలైన తర్వాత జ్ఞానబోధ అవుతున్నది. ఆల్‌రౌండర్‌గా జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తాడనుకున్న గ్రీన్ తనపై పెట్టిన ధరకు న్యాయం చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఎంతలా అంటే దాదాపు ప్రతీ మ్యాచ్‌కు రూ.2 కోట్ల చొప్పున లెక్క వేసుకున్నా గ్రీన్ లక్ష రూపాయల ఆటతీరు కనబర్చలేకపోతున్నాడు.
ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గ్రీన్ చేసిన పరుగులు చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ముంబై, హైదరాబాద్, పంజాబ్‌తో మ్యాచ్‌ల్లో వరుసగా 18, 2, 4 పరుగులు చేసిన ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. తనపై పెట్టిన ధరకు పూర్తి విరుద్ధంగా వరుసగా విఫలమవుతున్న గ్రీన్ జట్టుకు భారంగా మారిన వైనంపై పలువురు అభిమానులు తమదైన రీతిలో సోషల్‌మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఈ మధ్యే వెన్నెముక గాయం నుంచి కోలుకున్న గ్రీన్..క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఆదేశాల మేరకు బ్యాటింగ్‌కు పరిమితమవుతూ బౌలింగ్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడుతాడనుకున్న గ్రీన్ జట్టుకు గుదిబండలా మారడం కోల్‌కతాకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది.
ఇప్పటికే పతిరణ, హర్షిత్ రానా, ఆకాశ్‌దీప్ గాయాలతో లీగ్‌కు పూర్తిగా దూరం కాగా, మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ బౌలింగ్ వ్యూహాలు బ్యాటర్ల ముందు అసలు పారడలం లేదు. దీంతో కోల్‌కతా ప్రతీ మ్యాచ్‌లో 200కు పైగా పరుగులు ఇచ్చుకుంటూ లీగ్‌లో ఇప్పటి వరకు పాయింట్ల ఖాతా తెరవలేకపోయింది. లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా గ్రీన్ ప్రదర్శన మెరుగవుతుందా లేక ఇలాగే కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గ్రీన్ కేవలం బ్యాటింగ్ వరకే పరిమితమైతే అప్పుడు అతని స్థానంలో విదేశీ బౌలర్ లేదా సిఫర్ట్‌ను జట్టులోకి తీసుకోవడం బెటర్ అని పలువురు ఫ్యాన్స్ కేకేఆర్‌కు సూచిస్తున్నారు. లీగ్‌లో మిగతా మ్యాచ్‌ల్లో గ్రీన్‌ను కొనసాగించడమా లేక మిగతా వారికి అవకాశమివ్వడమనేది తేలాల్సి వుంది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

