Brian Lara: విండీస్ చారిత్రాత్మక విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న లారా
Brian Lara: అత్యంత కఠిన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాకు కరేబియన్ కుర్రాళ్లు షాకిచ్చారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియాపై విండీస్ విజయాన్ని అందుకోవడంతో ఆ జట్టు క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు.
Brian Lara: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. గబ్బా (బ్రిస్బేన్) వేదికగా ఆదివారం ముగిసిన టెస్టులో 8 పరుగుల తేడాతో గెలచి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అత్యంత కఠిన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాకు కరేబియన్ కుర్రాళ్లు షాకిచ్చారు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియాపై విండీస్ విజయాన్ని అందుకోవడంతో ఆ జట్టు క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. కామెంటరీ బాక్స్‌లో ఉన్న విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. విజయంతో ఉప్పొంగిపోయాడు. కామెంటరీ చెబుతూనే అతడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అటు విజయం సాధించిన ఆనందంతో పాటు ఆస్ట్రేలియాను ఓడించిన కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంతో అతడి కళ్లు చెమర్చాయి.
గబ్బా వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇయాన్ స్మిత్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో బ్రియాన్ లారా కూడా కామెంటరీ బాక్స్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా విజయానికి 12 పరుగుల దూరంలో ఉండగా 51వ ఓవర్‌ను షెమర్ జోసెఫ్ సంధించాడు. తొలి బంతికి స్మిత్ పరుగులేమీ తీయలేదు. తర్వాత మూడు బంతుల్లో మూడు పరుగులొచ్చాయి. ఐదో బంతిని ఆఫ్‌స్టంప్ దిశగా వేసిన బంతిని హెజిల్వుడ్ వదిలేశాడు. కానీ బంతి వెళ్లి ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. అంతే కామెంటరీ బాక్స్‌లో ఉన్న లారా తన కళ్లను తానే నమ్మలేనట్టుగా సంబురపడిపోయాడు. అక్కడే ఉన్న గిల్‌క్రిస్ట్.. లారాను హత్తుకున్నాడు.
Brian Lara in tears. WI must rise again. pic.twitter.com/9PyXt41tI9
— Trendulkar (@Trendulkar) January 28, 2024
లారా విండీస్ క్రికెట్ ఎత్తుపల్లాలకు ప్రత్యేక సాక్షి. 1990వ దశకంలో ఎంట్రీ ఇచ్చిన లారా వచ్చేసరికి అప్పటికీ వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్లో ప్రమాదకర జట్టుగానే ఉంది. విండీస్ దిగ్గజాల అడుగు జాడల్లో నడిచిన లారా.. ఆ తర్వాత ఆ జట్టు పతనాన్ని చూశాడు. గత పదిహేనేండ్ల కాలంలో విండీస్ జట్టులోని ఆటగాళ్లు జాతీయ జట్టుకు కాకుండా ఫ్రాంచైజీలకు ఆడుతుండటాన్ని చూసి ఆవేదనకు గురైన లారాకు కరేబియన్ కుర్రాళ్లు సాధించిన విజయంతో అతడు భావోద్వేగానికి లోనయ్యాడు.
A West Indies superstar, and Brian Lara pic.twitter.com/8Mtvj2JSHC
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

