SRH vs RR : చెపాక్ స్టేడియంలో జరుగుతున్న క్వాలిఫయర్ 2లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు భారీ షాక్. డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ(12)ను బౌల్ట్ వెనక్కి పంపాడు. రెండో బంతికి స్టాండ్స్‌లోకి పంపిన అభిషేక్ ఆఖరి బంతికి షాట్ఆడబోగా గురి తప్పింది. అంతే.. అక్కడే ఉన్న కాడ్మొరె తేలికైన క్యాచ్ పట్టాడు. దాంతో, 13 వద్ద హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది.
రెండో ఓవర్లోనే స్పిన్నర్ అశ్విన్‌కు బంతి అందుకోగా.. రాహుల్ త్రిపాఠి(12) రెండు ఫోర్లు బాదాడు. బౌల్ట్ వేసిన తర్వాతి ఓవర్లో 7 రన్స్ వచ్చాయంతే. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 5 పరుగులతో ఆడుతున్నాడు. 3 ఓవర్లకు స్కోర్… 29/1.