Chamika Karunaratne | క్యాచ్ అందుకుని 4 పళ్లు పోగొట్టుకున్న శ్రీలంక ఆటగాడు.. వైరల్ అవుతున్న వీడియో
లంకన్ ప్రీమియర్ టీ20 లీగ్‌లో చమిక 4 పళ్లు పోగొట్టుకున్నాడు
Chamika Karunaratne : ఆట ఏదైనా కొన్నిసార్లు ప్లేయర్స్ అనుకోకుండా గాయ పడుతుంటారు. క్రికెట్లో ఫీల్డర్లకు క్యాచ్ పడుతుండగా అప్పుడప్పుడు దెబ్బలు తగులుతాయి. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే క్యాచ్ పట్టుకునే క్రమంలో 4 పళ్లు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన లంకన్ ప్రీమియర్ టీ20 లీగ్ (ఎల్పీఎల్) బుధవారం చోటుచేసుకుంది. చమిక తీవ్రంగా గాయపడడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.
చమిక క్యాండీ ఫాల్కన్స్ తరఫున ఆడుతున్నాడు. గాలే గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నువానిడు ఫెర్నాండో బంతిని గాల్లోకి లేపాడు. ఆ క్యాచ్‌ను అందుకోవడానికి చమిక వెనక్కి పరుగెత్తాడు. క్యాచ్ పట్టుకున్నాడు. దాంతో, తోటి ఆటగాళ్లు సంతోషంతో పరుగెత్తుతూ అతని దగ్గరకు వచ్చారు. అయితే.. చమిక మాత్రం వాళ్లను దూరంగా ఉండాలని వారించాడు. ఎందుకో వాళ్లకు అర్థం కాలేదు. క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేరుగా అతని ముఖానికి బలంగా తాకింది. దాంతో నోటి వెంట రక్తం కారింది. బంతి గట్టిగా తాకడంతో ఒక పన్ను ఊడొచ్చింది. వెంటనే అతడిని గాలేలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ మరో మూడు పళ్లను డాక్టర్లు తీసేశారు. చమిక ఆరోగ్యం బాగానే ఉందని, తర్వాతి స్టేజ్ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉంటాడని క్యాండీ ఫాల్కన్ యాజమాన్యం వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో క్యాండీ ఫాల్కన్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1
— Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

