KSCA | డిసెంబర్ 7న ఎన్నికలు.. మాజీ పేసర్‌కు ఊహించని షాకిచ్చిన హై కోర్ట్..!
KSCA : కర్నాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad)కు షాక్ తగిలింది. ఏకగ్రీవంగా అతడు కేఎస్‌సీఏ బాస్‌గా ఎన్నికవ్వడం ఖాయం అనుకున్నవేళ హైకోర్టు (High Court) కీలక నిర్ణయం తీసుకుంది.
KSCA : కర్నాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad)కు షాక్ తగిలింది. ఏకగ్రీవంగా అతడు కేఎస్‌సీఏ బాస్‌గా ఎన్నికవ్వడం ఖాయం అనుకున్నవేళ హైకోర్టు (High Court) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం ఎన్నికల అధికారి తిరస్కరించిన కే.ఎన్ శాంత్ కుమార్ (KN Shanth Kumar) నామినేషన్‌ను పునరుద్ధరించింది. దాంతో.. కర్నాటక క్రికెట్ సంఘానికి డిసెంబర్ 7న జరుగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ప్రసాద్, శాంత్ కుమార్ పోటీ పడనున్నారు.
షెడ్యూల్ ప్రకారం ప్రకారం నవంబర్ 30న కర్నాటక క్రికెట్ సంఘానికి ఎన్నికలు జరగాలి. కానీ, ఎన్నికల నిర్వహణాధికారి డాక్టర్.బి. బసవరాజు (మాజీ ఐఏఎస్) క్రికెట్ సంఘం నిర్వహణ కమిటీ నుంచి స్పష్టత లేదని.. వెంటనే కోర్టు జోక్యం చేసుకోవాలని పట్టుపట్టారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ సూరజ్ గోవిందరాజు ఎలక్షన్స్‌ను డిసెంబర్ 7న నిర్వహించాలని చెప్పారు. అధ్యక్ష పదవి కోసం గేమ్ ఛేంజర్స్ టీమ్ నుంచి వెంకటేశ్ ప్రసాద్, టీమ్ బ్రిజేశ్ నుంచి కే.ఎన్. శాంత్ కుమార్, కల్పన వెంకటాచార్ నామినేషన్ వేశారు. కానీ, సాంకేతిక కారణాలతో శాంత్ దరఖాస్తును ఎన్నికల అధికారి తిరస్కరించారు.
ಕೆಎಸ್ಸಿಎ ಚುನಾವಣೆ: ಶಾಂತಕುಮಾರ್ಗೆ ರಿಲೀಫ್; ಸ್ಪರ್ಧೆಗೆ ಹೈಕೋರ್ಟ್ ಅವಕಾಶhttps://t.co/QbvhrpBXfI#KSCACourtOrder #KNSanthakumar #Cricket #KarnatakaHighCourt #KSCA pic.twitter.com/BCXKx5kJ7O
— The Federal ಕರ್ನಾಟಕ (@TheFederal_KA) November 29, 2025
అయితే.. అతడు ఎన్నికల అధికారి నిర్ణయాన్ని హై కోర్టులో సవాల్ చేశాడు. ఫలితంగా ఈ వ్యవహారంలో మరోసారి జోక్యం చేసుకున్న కోర్టు.. శాంత్ కుమార్ నామినేషన్ సాంకేతికంగా ఆమోదయోగ్యమేనని తెలిపింది. ప్రింటర్స్ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ అయిన శాంత్ కుమార్ కర్నాటక క్రికెట్ సంఘానికి రూ.200 బాకీ ఉన్నాడని.. సాంకేతికంగా అతడి దరఖాస్తు చెల్లదని ఎన్నికల అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ బసవరాజు స్పష్టం చేశారు. అయితే.. హై కోర్టు మాత్రం ఆ కారణం సహేతుకం కాదని పేర్కొంటూ శాంత్ కుమార్ పోటీలో ఉంటాడని తేల్చి చెప్పింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

