DC vs RCB | ఐపీఎల్లో సంచలనం.. 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ..!
DC vs RCB : పంతొమ్మిదో సీజన్లో సంచలనం నమోదైంది. గత మ్యాచ్‌లో 264 పరుగుల స్కోర్ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి అనూహ్యంగా 75కే కుప్పకూలింది.
DC vs RCB : పంతొమ్మిదో సీజన్లో సంచలనం నమోదైంది. గత మ్యాచ్‌లో 264 పరుగుల స్కోర్ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి అనూహ్యంగా 75కే కుప్పకూలింది. పవర్ ప్లేలోనే ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్(3-5), హేజిల్‌వుడ్(4-12) వికెట్ల వేటతో ఢిల్లీ బ్యాటర్లు సున్నాలు చుట్టేశారు. బంతిని స్వింగ్ చేస్తూ ఇద్దరూ వికెట్ల పండుగ చేసుకోగా 8 పరుగులకే ఆరు వికెట్లు పడ్డాయి. డేవిడ్ మిల్లర్(19), ఇంప్యాక్ట్ సబ్ అభిషేక్ పొరెల్(30) పోరాటంతో కోలుకునట్టే కనిపించినా.. హేజిల్‌వుడ్ యార్కర్‌తో అతడిని బౌల్డ్ చేయగా ఢిల్లీ ఇన్నింగ్స్ 16.3 ఓవర్లలోనే ముగిసింది.
భారీ స్కోర్ల మ్యాచ్‌లతో బోర్ కొట్టిన ఐపీఎల్లో పెను సంచలనం. పంజాబ్ కింగ్స్‌పై రికార్డు స్కోర్ బాదిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్(3-5), హేజిల్‌వుడ్(3-6) వణికించారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో బంతితో రెచ్చిపోయిన భువి, హేజిల్‌వుడ్ ఢిల్లీ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మొదటి బంతికే అరంగేట్రం కుర్రాడు సహిల్ పరాఖ్(0)కు భువనేశ్వర్ యార్కర్‌తో బౌల్డ్ చేశాడు.
Woke up, chose swing, and completely dismantled the batting 🤌
Describe Bhuvneshwar Kumar’s phenomenal opening spell in just one word 🗣️
Updates ▶️ https://t.co/HIiNNEutP0#TATAIPL | #KhelBindaas | #DCvRCB | @RCBTweets pic.twitter.com/7GrRElK5QZ
— IndianPremierLeague (@IPL) April 27, 2026
ఆ తర్వాతి ఓవర్లో హేజిల్‌వుడ్ మొదటి రెండు బంతుల్లో కేఎల్ రాహుల్(1), సమీర్ రిజ్వీ(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. ట్రిస్టన్ స్టబ్స్(5) వికెట్ కాపాడుకున్నా భువనేశ్వర్‌కు దొరికిపోయాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే అక్షర్ పటేల్(0)ను భువి ఔట్ చేసి ఢిల్లీని భయపెట్టాడు. నేనేమన్నా తక్కువా అన్నట్టు ఆ తర్వాతి ఓవర్లోనే నితీశ్ రానా(1)ను హేజిల్‌వుడ్ వెనక్కి పంపాడు. అంతే.. 8 పరుగులకే ఆరో వికెట్ పడింది.
పొరెల్ నిలబడడంతో..
బెంగళూరు పేసర్ల విజృంభణ చూశాక ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ పేరిటున్న అత్యల్ప స్కోర్‌ను ఢిల్లీ బ్రేక్ చేస్తుందనిపించింది. కానీ, డేవిడ్ మిల్లర్(19), ఇంప్యాక్ట్ సబ్ అభిషేక్ పొరెల్(30) పట్టుదలగా ఆడారు. వీరిద్దరు వికెట్ కాచుకోవడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. ఓపికగా ఆడుతున్న మిల్లర్, పొరెల్ జోడీని విడదీసిన రసిక్ దార్ సలాం ఢిల్లీని ఆలౌట్ అంచున నిలిపాడు. కుల్దీప్ అండతో జట్టు స్కోర్ 70 దాటించాడు పొరెల్. కానీ, 17వ ఓవర్ మూడో బంతిని హేజిల్‌వుడ్ సంధించిన యార్కర్‌కు అతడు బౌల్డయ్యాడు. దాంతో, 75 పరుగులకే ఢిల్లీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

