లండన్: క్రికెట్ బంతి ముఖానికి బలంగా తాకిన ఘటనలో చావు నుంచి తప్పించుకున్నానని ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. గత ఫిబ్రవరిలో డర్హామ్ అకాడమీలో కౌంటీ ప్లేయర్లతో ఆడే సమయంలో స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డాడు.
బంతి నేరుగా ముఖానికి తాకడంతో కుడి దవడ ఎముకకు గాయమైంది. ఇటీవలే శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న స్టోక్స్ తాజాగా ఈసీబీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించాడు. ‘బంతి ముఖాన్ని బలంగా తాకింది. ఇంతటి ప్రమాదకర స్థితిలో అదృష్టం ఏంటంటే తల కొంచెం పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే మీ ముందు ఈ ఇంటర్వ్యూలో ఉండేవాడిని కాదు’ అని అన్నాడు.