రెండో వన్డే ప్రారంభానికి ముందు వైజాగ్ మైదానంలో సినీ హీరో నాని హల్చల్ చేశాడు. కామెంటేటర్లతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన నాని.. టీమ్ఇండియా ప్లేయర్లకు తన సినిమా పేర్లను ఆపాదించి సందడి చేశాడు. సునీల్ గవాస్కర్, అరోన్ ఫించ్, ఎమ్మెస్కే ప్రసాద్‌తో నాని ప్రత్యేకంగా ముచ్చటించాడు.
ఈ సందర్భంగా తన అభిమాన క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని నాని వెల్లడించాడు. ఒకప్పుడు సచిన్ ఔటైతే టీవీలు ఆపేసేవాళ్లమని చెప్పాడు.