ODI WC 2023 | వరల్డ్ కప్ ఏర్పాట్లు షురూ.. రూ.502 కోట్లతో ఐదు ప్రధాన స్టేడియాలకు కొత్త కళ
ODI WC 2023 : ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మెగా సమరానికి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దాంతో, ఐదు ప్రధాన స్టేడియాలకు మరమ్మతులు చేసి, వాటికి కొత్త కళ తెచ్చేందుకు బీసీసీఐ ఏర్పాట్లు మొదలుపెట్టింది. అందుకోసం భారీ మొత్తంలో రూ. 502.92 కోట్లు ఖర్చు చేయనుంది.
ODI WC 2023 : ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మెగా సమరానికి మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దాంతో, ఐదు ప్రధాన స్టేడియాలకు మరమ్మతులు చేసి, వాటికి కొత్త కళ తెచ్చేందుకు బీసీసీఐ(BCCI) ఏర్పాట్లు మొదలుపెట్టింది. అందుకోసం భారీ మొత్తంలో రూ. 502.92 కోట్లు ఖర్చు చేయనుంది. ఇంతకు ఆ ఐదు స్టేడియాలు ఏవంటే..? ఢిల్లీ స్టేడియం, వాంఖడే(ముంబై), మొహాలీ (పంజాబ్), రాజీవ్ గాంధీ(హైదరాబాద్), ఈడెన్స్ గార్డెన్( కోల్‌కతా).
ఈడెన్స్ గార్డెన్(Eden Gardens) మైదానాన్ని రూ. 117.17 కోట్లతో రిపేర్ చేయనున్నారు. ఢిల్లీ స్టేడియం మరమ్మతుల కోసం రూ. 100 కోట్లు, హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియాన్ని ముస్తాబు చేయడం కోసం రూ.117.7 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. పంజాబ్‌లోని మొహాలీ స్టేడియం మరమ్మతు కోసం రూ.79.46 కోట్లు, ముంబైలోని వాంఖడే మైదానాన్ని సుందరీకరించేందుకు రూ.78.82 కోట్లు కేటాయించారు.
షార్ట్ లిస్ట్‌లో 20 మంది
ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్ మధ్యలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియాతో సహా తొమ్మిది జట్టు క్వాలిఫై అయ్యాయి. 2011లో స్వదేశంలో విశ్వ విజేతగా నిలిచిన భారత్ ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. వరల్డ్ కప్ సన్నద్ధత కోసం బీసీసీఐ 20 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన విషయం తెలిసిందే. టాప్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసిరానుంది. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ఆసీస్ సిరీస్‌లో ఇరగదీశారు. షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ రూపంలో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. సొంతగడ్డపై రోహిత్ సేన ట్రోఫీ నెగ్గుతుందా? మూడోసారి వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలుస్తుందా? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
ఇవి కూడా చదవండి
Lucknow Super Giants: థ్రిల్లర్‌లో నెగ్గిన లక్నో.. లాస్ట్ బాల్ డ్రామా చూడాల్సిందే.. వీడియో
రాణా బ్యాట్‌తో రింకూ సిక్సర్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

