క్రికెట్..కొత్తగా !
పొట్టి ఫార్మాట్‌కు మరింత మెరుగులు అద్దేందుకు రంగం సిద్ధమైంది. అభిమానులకు మరింత చేరువ కావడంతో పాటు టీ20లను ఆకర్షణీయంగా మలిచేందుకు కొత్త నిబంధన రాబోతున్నది.
- టీ20ల్లో ఇమ్ప్యాక్ట్ ప్లేయర్ రూల్
- ప్రయోగత్మకంగా ముస్తాక్ అలీ టోర్నీలో
- పొట్టి ఫార్మాట్లో బీసీసీఐ కొత్త నిబంధన
పొట్టి ఫార్మాట్‌కు మరింత మెరుగులు అద్దేందుకు రంగం సిద్ధమైంది. అభిమానులకు మరింత చేరువ కావడంతో పాటు టీ20లను ఆకర్షణీయంగా మలిచేందుకు కొత్త నిబంధన రాబోతున్నది. గతంలో ఉన్న సబ్‌స్టిట్యూట్‌కు కొత్త రూపం తీసుకొస్తూ ఇమ్ప్యాక్ట్ ప్లేయర్ పేరిట బీసీసీఐ నూతన నిబంధనకు పచ్చజెండా ఊపింది. దేశవాళీల్లో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఈ నిబంధనను బోర్డు ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే రానున్న ఐపీఎల్ సీజన్లో ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నది. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో ఇమ్ప్యాక్ట్ ప్లేయర్ రూల్ ఎలా ఉంటుందో చూడాలి.
ముంబై: క్రికెట్ కొత్త హంగులు అద్దుకుంటున్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా, అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆటలో మార్పులు, చేర్పులు చేస్తూనే ఉన్నారు. దీనికి టీ20లు, వన్డేలు, టెస్టులు ఏదీ అతీతం కావడం లేదు. తాజాగా పొట్టి ఫార్మాట్‌కు మరిన్ని వన్నెలు తీసుకొచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. గతంలో ఉన్న సబ్‌స్టిట్యూట్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తూ బోర్డు కొన్ని మార్పులు తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా వచ్చే నెల 11 నుంచి మొదలవుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20టోర్నీలో ‘ఇమ్ప్యాక్ట్ ప్లేయర్’ నిబంధనను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొస్తున్నది. దీనిపై దేశంలోని ఆయా రాష్ర్టాల క్రికెట్ సంఘాలకు బీసీసీఐ తమ మెయిల్లో సవివరంగా పేర్కొంది. వాస్తవానికి 2005లోనే ఐసీసీ..వన్డే ఫార్మాట్లో సబ్‌స్టిట్యూట్ నిబంధనను ప్రవేశపెట్టింది. అయితే ఏడాది తిరిగే లోపే ఆ విధానానికి మంగళం పాడింది. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్‌లో ‘ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్’ పేరిట నిబంధనను అమలు చేస్తున్నది. దీని ప్రకారం టాస్ సమయంలోనే ఇరు జట్లు 12 లేదా13వ ప్లేయర్‌ను 10 ఓవర్లు ముగిసిన తర్వాత మైదానంలోకి దింపేవి.
ఇలా తమ వ్యుహాలకు అనుగుణంగా ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించేవి. దాదాపు దీన్ని పోలిన నిబంధననే తాజాగా బీసీసీఐ అమలు చేయాలని చూస్తున్నది. ‘టీ20 క్రికెట్‌కు జనాల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని మరింత ఆకర్షణీయంగా తీసుకురావాలనుకుంటున్నాం. కొత్త నిబంధనల వల్ల చూసే ప్రేక్షకులకు మాత్రమే కాదు, వ్యూహాల పరంగా జట్లకు బాగా కలిసి వస్తుంది’ అని బీసీసీఐ తమ మెయిల్లో రాష్ట్ర సంఘాలకు సూచించింది. ‘ఇమ్ప్యాక్ట్ ప్లేయర్’ నిబంధన ప్రకారం ఇరు జట్లు తమ ఫైనల్ లెవన్‌లో ఒక ప్లేయర్‌ను తప్పించి మరొకరిని తీసుకునే అవకాశముంటుంది.
అసలు సబ్‌స్టిట్యూట్ రోల్ వల్ల లాభం ఏంటీ?
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు తమ ఫైనల్ లెవెన్‌తో పాటు అదనంగా నలుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌లో 14వ ఓవర్ పూర్తయ్యే లోపు తుది జట్టులో ఒకరిని తప్పించి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను తీసుకునే అవకాశముంటుంది. సదరు ప్లేయర్ బ్యాటింగ్‌తో పాటు పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు. ఇమ్ప్యాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల జట్లకు చాలా అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి. ఉదాహరణకు ఒక బ్యాటర్ ఔటైనా..అతని స్థానంలో మరో బ్యాటర్‌ను తీసుకోవచ్చు. మొత్తంగా 11మంది బ్యాటర్లను వాడుకోవచ్చు. బౌలింగ్ విషయానికొస్తే…అప్పటికే బౌలింగ్ వేసిన ప్లేయర్ స్థానంలో వచ్చిన సబ్‌స్టిట్యూట్ పూర్తి కోటా ఓవర్లు వేసే చాన్స్ ఉంటుంది.
ఎక్స్ ఫ్యాక్టర్‌కు, ఇమ్ప్యాక్ట్కు తేడా ఏంటీ?
ప్రపంచంలోని మిగతా టీ20 నిబంధనలతో పోల్చుకుంటే ఇమ్ప్యాక్ట్ ప్లేయర్ వల్ల వ్యూహాత్మకంగా జట్లకు బాగా కలిసి రానుంది. 2005-06లో వన్డేల్లో తీసుకొచ్చిన సూపర్‌సబ్ రూల్‌లో అప్పటికే ఔటైన బ్యాటర్ స్థానంలో ప్లేయర్‌ను తీసుకుంటే..అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం లేకపోయేది. బౌలింగ్‌లోనూ అదే విధంగా వైదొలిగిన ప్లేయర్ వేయగా మిగిలిన ఓవర్లను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ వేయాల్సి వచ్చేది. బీబీఎల్‌లో ఎక్స్ ఫ్యాక్టర్ రూల్ విషయానికొస్తే..10 ఓవర్ల లోపు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను దింపాల్సి ఉంటుంది. అప్పటికే బ్యాటింగ్ చేసిన ప్లేయర్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వస్తే మళ్లీ బ్యాటింగ్ చేసే చాన్స్ ఉండదు. బౌలింగ్‌లో ఒక ఓవర్ కంటే ఎక్కువ వేస్తే సదరు ప్లేయర్ బౌలింగ్ చేయడానికి అనర్హుడు.
- అప్పటికే ఒక జట్టు ఇమ్ప్యాక్ట్ ప్లేయర్‌ను తీసుకొని, రెండో ఇన్నింగ్స్‌ను పది ఓవర్లకు కుదించినా నిబంధనను వినియోగించుకోవచ్చు. తొమ్మిది ఓవర్ల ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్ ముగియకముందే ప్లేయర్‌ను పోటీకి దింపవచ్చు. ఐదు ఓవర్ల మ్యాచ్కొస్తే..మూడో ఓవర్ ముందు ఇది వర్తిస్తుంది.
- ఓవర్ ముగిసిన తర్వాతే ఇమ్ప్యాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో సడలింపులు ఉన్నాయి. బ్యాటింగ్ జట్టు తమ బ్యాటర్ ఓవర్ మధ్యలో ఔటైతే..అప్పుడు ఇమ్ప్యాక్ట్ ప్లేయర్‌ను వినియోగించుకోవచ్చు. అదే విధంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ప్లేయర్‌కు బదులుగా ఇమ్ప్యాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. అయితే ఇమ్ప్యాక్ట్ ప్లేయర్ స్థానంలో వైదొలగిన ఆటగాడు మళ్లీ మ్యాచ్‌లో భాగం కాకూడదు. ఆఖరికి సబ్‌స్టిట్యూట్‌గా దిగే అవకాశం కూడా ఉండదు.
- ఒక ఓవర్లో రెండు బీమర్స్ వేసి సస్పెండ్ అయిన బౌలర్ స్థానంలో వచ్చిన ఇమ్ప్యాక్ట్ ప్లేయర్‌కు బౌలింగ్ చేసే అవకాశముండదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

