అహో అనస్తాసియా..

- ఫైనల్లో రష్యా భామ..
- క్రెజికోవాతో టైటిల్ ఫైట్..
- ఫ్రెంచ్ ఓపెన్
52 సార్లు మేజర్ టోర్నీల్లో బరిలోకి దిగిన రష్యా సుందరి అనస్తాసియా పవ్ల్యూచెంకోవా తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టిస్తే.. నేనేం తక్కువా అన్నట్లు బార్బొరా క్రెజికోవా మట్టికోర్టులో తుది సమరానికి దూసుకొచ్చింది. అంచనాలకు అందకుండా సాగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ మహిళల తుది పోరుకు సిద్ధమైన ఇద్దరు అనామక క్రీడాకారిణులు టైటిల్ ఫైట్‌కు సిద్ధమవుతుంటే.. ఫైనల్ కాని ఫైనల్లో తలపడేందుకు నాదల్, జొకోవిచ్ అస్త్రశస్ర్తాలు సరిచేసుకుంటున్నారు.
పారిస్: దశాబ్ద కాలం క్రితం రోలాండ్ గారోస్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన రష్యా భామ అనస్తాసియా పవ్ల్యూచెంకోవా.. మేజర్ టోర్నీల్లో 52 ప్రయత్నాల అనంతరం తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 31వ సీడ్ పవ్ల్యూచెంకోవా 7-5, 6-3తో ప్రపంచ 85వ ర్యాంకర్ తమార జిదాన్సెక్ (స్లొవేనియా)పై విజయం సాధించింది. రష్యా నుంచి షరపోవా (2014) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పోరుకు చేరిన తొలి క్రీడాకారిణిగా పవ్ల్యూచెంకోవా నిలిచింది. ఈ విజయం సంతోషాన్నివ్వడంతో పాటు భావోద్వేగానికి గురిచేసిందని సెమీస్ అనంతరం చెప్పిన పవ్ల్యూచెంకోవా.. ఫైనల్లో శక్తివంచన లేకుండా పోరాడుతానని అంటున్నది. ఉత్కంఠభరితంగా సాగిన మరో సెమీఫైనల్లో బార్బోరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 4-6, 9-7తో 17వ సీడ్ మరియా సక్కారి (గ్రీస్) పై గెలిచింది. శనివారం జరుగనున్న టైటిల్ పోరులో క్రెజికోవాతో పవ్ల్యూచెంకోవా తలపడనుంది.
నాదల్ x జొకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు ముందే అసలు సిసలు సమరం అభిమానులను అలరించనుంది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నేడు ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ నాదల్ (స్పెయిన్) తలపడనున్నారు. మట్టికోర్టులో సింహంలా విజృంభించే నాదల్‌ను జొకో ఎలా అడ్డుకుంటాడో చూడాలి. ముఖాముఖిలో జొకో ముందున్నా.. మట్టికోర్టులో విశ్వరూపం ప్రదర్శించే నాదల్ ముందు నిలువగలడా అనేది నేడు తేలనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

