BANvsNZ: తైజుల్ ఇస్లాం అరుదైన ఘనత.. ఫ్యాబ్-4 వికెట్లు తీసిన బంగ్లా బౌలర్
BANvsNZ: సిల్హెట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ స్పిన్నర్ ఆధునిక క్రికెట్లో ఫ్యాబ్-4 గా పిలువబడుతున్న నలుగురు బ్యాటర్లను ఔట్ చేయడం గమనార్హం.
BANvsNZ: బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. సిల్హెట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ స్పిన్నర్ ఆధునిక క్రికెట్లో ఫ్యాబ్-4 గా పిలువబడుతున్న నలుగురు బ్యాటర్లను ఔట్ చేయడం గమనార్హం. తొలి టెస్టులో కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ను అతడు రెండుసార్లూ ఔట్ చేశాడు. తద్వారా ఫ్యాబ్ – 4 జాబితాలో ఉన్న విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పాటు కేన్ మామను కూడా ఔట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు.
తైజుల్ 2016లో మీర్ఫూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో జో రూట్‌ను ఔట్ చేయగా ఆ మరుసటి ఏడాది చిట్టగాంగ్‌లో జరిగిన టెస్టులో ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను రెండుసార్లు ఔట్ చేశాడు. ఇక 2017, 2022లో విరాట్ కోహ్లీని కూడా ఔట్ చేసిన తైజుల్ తాజాగా కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపి అరుదైన ఘనత నెలకొల్పాడు.
A match-defining bowling performance from Taijul Islam 🤩#WTC25 | #BANvNZ pic.twitter.com/fEbsKUdH13
— ICC (@ICC) December 2, 2023
బంగ్లా – కివీస్ మధ్య నేడు ముగిసిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 310 పరుగులు చేయగా కివీస్ 317 రన్స్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా.. 338 పరుగులు చేసి న్యూజిలాండ్ ఎదుట 331 పరుగుల టార్గెట్‌ను నిలిపింది. కానీ ఛేదనలో పర్యాటక జట్టు 181 పరుగులకే కుప్పకూలింది. తైజుల్ ఇస్లాం తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా ఈ టెస్టులో అతడు పది వికెట్లు పడగొట్టడం గమనార్హం. టెస్టులలో అతడికి ఈ ఫీట్ నమోదు చేయడం ఇది రెండోసారి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

