BANvsNZ: తొలి టెస్టులో పట్టుబిగిస్తున్న బంగ్లాదేశ్.. కెప్టెన్ సెంచరీతో భారీ ఆధిక్యం
BANvsNZ: తొలి ఇన్నింగ్స్‌లో తాము చేసిన స్కోరు (310) కంటే కివీస్‌కు ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యమే ఇచ్చిన బంగ్లాదేశ్.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం రెచ్చిపోయింది.
BANvsNZ: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంటోంది. తొలి ఇన్నింగ్స్‌లో తాము చేసిన స్కోరు (310) కంటే కివీస్‌కు ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యమే ఇచ్చిన బంగ్లాదేశ్.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం రెచ్చిపోయింది. కెప్టెన్ నజ్ముల్ హోసెన్ శాంతో (193 బంతుల్లో 104 నాటౌట్, 10 ఫోర్లు) శతకం సాధించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్.. 68 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసింది. ఆ జట్టు ఆధిక్యం ప్రస్తుతం 205 పరుగులుగా ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలుండటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతకుముందు కేన్ విలియమ్సన్ సెంచరీ సాయంతో ఓవర్ నైట్ స్కోరు 266-8 పరుగుల వద్ద మూడో రోజు ఆట మొదలుపెట్టిన కివీస్ 317 పరుగులకు ఆలౌట్ అయింది. జెమీసన్ (23)తో పాటు కెప్టెన్ టిమ్ సౌథీ (35) పోరాడటంతో ఆ జట్టుకు ఏడు పరుగుల ఆధిక్యం దక్కింది.
A solid century from captain Najmul Hossain Shanto has put Bangladesh on top 👏#WTC25 | #BANvNZ | 📝: https://t.co/KSYuqT5oeG pic.twitter.com/AlI7pNsWWB
— ICC (@ICC) November 30, 2023
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్.. తొలి ఇన్నింగ్స్ హీరో మహ్ముదల్ హసన్ జాయ్ (8) వికెట్‌ను ఆదిలోనే కోల్పోయింది. అతడు రనౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ జకీర్ హసన్ (17) అజాజ్ పటేల్ వేసిన 14వ ఓవర్లో ఎల్బీగా నిష్క్రమించాడు. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాను శాంతో, మోమినుల్ హక్ (40) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 90 పరుగులు జోడించారు. టిమ్ సౌథీ, జెమీసన్, అజాజ్ పటేల్, ఇష్ సోధీ వంటి పటిష్టమైన బౌలింగ్ లైనప్‌ను ఈ జోడీ సమర్థంగా ఎదురుకుంది. కానీ మోమినుల్.. రనౌట్ కావడంతో ఆ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మోమినుల్ నిష్క్రమించినా.. ముష్ఫీకర్ రహీమ్‌తో కలిసి శాంతో బంగ్లా ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

