BANvsNZ: తొలి రోజే 15 వికెట్లు.. ఆసక్తికరంగా బంగ్లా-కివీస్ రెండో టెస్టు
BANvsNZ: ఇరు జట్లలోనూ బంతిని అందుకున్న స్పిన్నర్ వికెట్ తీయకుండా స్పెల్‌ను ముగించలేదంటే ఢాకా వికెట్ స్పిన్‌కు ఎంత సహకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. స్పిన్నర్లు రాణించడంతో తొలి రోజే ఏకంగా 15 వికెట్లు నేలకూలాయి.
BANvsNZ: బంగ్లాదేశ్-న్యూజిలాండ్ మధ్య ఢాకాలో జరుగుతున్న రెండో టెస్టులో తొలిరోజే స్పిన్నర్లు పండుగ చేసుకున్నారు. ఇరు జట్లలోనూ బంతిని అందుకున్న స్పిన్నర్ వికెట్ తీయకుండా స్పెల్‌ను ముగించలేదంటే ఢాకా వికెట్ స్పిన్‌కు ఎంత సహకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇరు జట్ల స్పిన్నర్లు రాణించడంతో తొలి రోజే ఏకంగా 15 వికెట్లు నేలకూలాయి. ఇందులో పేసర్లు తీసింది ఒక్కటంటే ఒక్క వికెట్ మాత్రమే. బంగ్లాను తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ చేశామని సంబురపడ్డ కివీస్.. 12 ఓవర్లలోనే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.
ఢాకాలోని షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. కివీస్ స్పిన్నర్ల ధాటికి 66.2 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్‌లు తలా మూడు వికెట్లు తీయగా మరో స్పిన్నర్ అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. బంగ్లా జట్టులో ముష్ఫీకర్ రహీమ్.. 35 పరుగులతో టాప్ స్కోరర్.
కివీస్దీ అదే కథ..
బంగ్లాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆనందం కివీస్‌కు ఎంతోసేపు నిలువలేదు. ఆరో ఓవర్లోనే ఆ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది. 14 బంతులాడి 11 పరుగులు చేసిన ఓపెనర్ డెవాన్ కాన్వేను మిరాజ్ హసన్ బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్లో బంగ్లా తురుపుముక్క తైజుల్ ఇస్లాం.. టామ్ లాథమ్ (4)ను ఔట్ చేశాడు. అతడే వేసిన 9వ ఓవర్లో హెన్రీ నికోలస్ (1) కూడా పెవిలియన్ చేరాడు. కివీస్ భారీ ఆశలు పెట్టుకున్న తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేన్ విలియమ్సన్ (13) కూడా మిరాజ్ వేసిన 12వ ఓవర్లో రెండో బంతికి షాదాత్ హోసేన్‌కు క్యాచ్ ఇచ్చాడు. 13వ ఓవర్ నాలుగో బంతికి వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (౦) ను కూడా మిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి డారిల్ మిచెల్ (12 బ్యాటింగ్), గ్లెన్ ఫిలిప్స్ (5 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ ఇంకా 117 పరుగులు వెనుకబడి ఉంది.
Dutch-Bangla Bank Test Series 2023
Bangladesh 🆚 New Zealand 🏏 | 2nd TestStumps | Day 01 | New Zealand trail by 117 runs
Full Match Details: https://t.co/T3QHK95rOi#BCB | #Cricket | #BANvNZ pic.twitter.com/5BKshMFvWu
— Bangladesh Cricket (@BCBtigers) December 6, 2023
తొలి రోజు నేలకూలిన 15 వికెట్లలో కివీస్ సారథి టిమ్ సౌథీకి దక్కిన వికెట్ మాత్రమే పేసర్ తీసింది. మిగిలిన 14 వికెట్లలో ఫిలిప్స్ (౩), శాంట్నర్ (౩), అజాజ్ పటేల్ (2), మెహిది హసన్ మిరాజ్ (౩), తైజుల్ ఇస్లాం (2) లకే దక్కాయి. బంగ్లా బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్ (హ్యాండిల్ ది బాల్) రూపంలో ఔటయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

