షార్జా: యువ బ్యాట్స్‌మెన్ ఆశలంక (49 బంతుల్లో 80) సూపర్ ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్‌పై శ్రీలంక జట్టు ఘనవిజయం సాధించింది. పది ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసిన లంకను ఆశలంక, భానుక రాజపక్స (53) ఆదుకున్నారు. ముఖ్యంగా రాజపక్స బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
దీంతో శ్రీలంక శరవేగంగా లక్ష్యం వైపు దూసుకొచ్చింది. చివర్లో రాజపక్స అవుటైనా బౌండరీ కొట్టిన ఆశలంక లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన లంక మరో 7 బంతులు మిగిలుండగానే టార్గెట్ ఛేజ్ చేసింది.